శ్రీహరికోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
'''శ్రీహరికోట''' ([[ఆంగ్లం]] : '''Sriharikota''') [[నెల్లూరు]] జిల్లాలోని ఒక తీరప్రాంతపు [[ద్వీపము]], ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం|సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం]] గలదు, ఈ కేంద్రాన్ని [[ఇస్రో]] వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన [[రాకెట్|రాకెట్ల]]ను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం [[సూళ్ళూరుపేట]].
==నేపథ్యం==
[[శ్రీరాముడు]] ఈదీవిలో అరకోటి లింగాలను ప్రతిష్టించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడనీ అందువల్లనే ఈ ప్రాంతానికి '''శ్రీ అరకోటై''' గా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు ప్రజల నోళ్ళలో నాని, శ్రీహరికోట గా మారిందిన అక్కడి ప్రజలు భావిస్తారు. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. అమాయకులైన గిరిజన తెగలు నివసించే ప్రాంతం. [[1970]] వరకూ అంతరిక్ష పరిశోధనలకు [[కేరళ]] లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న '''తుంబా''' అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ [[విక్రమ్ సారాభాయ్]] నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.
"https://te.wikipedia.org/wiki/శ్రీహరికోట" నుండి వెలికితీశారు