రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==విశేషాలు==
ఈమె [[గుంటూరు]]. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో '''సతీఅనసూయ ధృవవిజయం''' అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.<ref>[http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=13511 ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7] </ref> 1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi R Balasaraswathi (b. 1928)]</ref>
==సంగీత అభ్యాసం==
వీరి ఇంటి వాతావరణ ప్రభావంవల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండీ సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ ఈమె ట్యూటర్‌. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. నాన్నగారు ఎంతోశ్రద్ధగా బొంబాయి తీసుకెళ్ళి వసంత దేశాయ్‌ దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో గూడవల్లిగారి చిత్రంలో నటించింది.
==నాన్న కల==
మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా, ఆరేళ్ళ వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కానీ ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ.
 
==చిత్రసమాహారం==