కనపర్తి సోదరులు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'నాదస్వర కళలో గొప్ప విద్వాంసులు కనపర్తి మస్తాన్ సాహెబ్, హుస్...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాదస్వర కళలో గొప్ప విద్వాంసులు కనపర్తి మస్తాన్ సాహెబ్, హుస్సేన్ సాహెబ్ సోదరులు. రాష్ట్రవ్యాప్తంగా నాదస్వర కళకు విశేష ప్రాచుర్యాన్నికలిగించిన గొప్ప కళాకారులు వీరు.<ref>http://epaper.andhrajyothy.com/812864/Guntur/18.05.2016#page/2/2</ref>
 
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన కనపర్తి మస్తాన్సా హెబ్(1924), హుస్సేన్సాహెబ్ (1932)లు హుస్సేన్సాహెబ్, ఫాతిమాబి దంపతులకు జన్మించారు. మస్తాన్ సోదరులు మొదట మేనమామలైన మోతుకూరి పకీర్సాహెబ్, చినగాలీబ్, జూలకల్లు మస్తాన్సాహెబ్ వద్ద
నాదస్వర కళలో శిక్షణ పొందారు. చిత్తాపురం విశిష్ట వ్యకల ఖురాన్సాహెబ్, తూబాడు వీరుసాహెబ్ -E వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. నాదబ్రహ్మ షేక్ చినపీరుసాహెబ్, ఆదం సాహెబ్ వద్ద నాదస్వర కళలో లోతులను అభ్యసించి ఉత్తమ కళాకారులుగా తర్ఫీదు పొందారు. మస్తాన్ సోదరులు రాగం వాయించడంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. స్వర ప్రస్తార ము వక్రమార్గంలో సాగించినప్పుడు దానిని స్పష్టంగా పలికించుట వీరి ప్రత్యేకత. హిందూస్థానీ సంప్రదాయాన్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నా రు. కనపర్తిసోదరులు ఆంధ్రదేశంతోపాటు తమిళ, కర్నాటక రాష్ట్రాలలో కూడా విశేషఖ్యాతి సముపార్జించారు. భారతదేశంలోని ముఖ్య నగరాలలో కచేరీలు చేసి ప్రముఖుల ప్రశంసలు పొందారు. 1956 నుండి ఆకాశవాణి విజయవాడ, తిరుచునాపల్లి కేంద్రాలలో సంగీత కచేరీలను నిర్వహించారు. మద్రాసు దూరదర్శన్ కేంద్రం వీరి కచేరీ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. సిలోన్ దక్షిణామూర్తి, ఈమని రాఘవయ్య గుంటుపల్లి గురవయ్య బూ సు రపల్లి వెంకటేశ్వర్లు, పసులూరి గురవయ్య మొదలైన డోలు విద్వాంసు లు వీరికి కచేరీలలో సహకరించారు. యలమంద వెంకటేశ్వరు, చింతల చెరువు సోదరులు, నిడమానూరు మస్తాన్ వంటి గొప్ప శిష్యులను రాష్ట్రానికి అందించారు. కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ కనపర్తి సోదరులకు వర్ణిషు నాదస్వర గాయకులు అనే బిరుదును ప్రదానం చేశారు. సే లంలో వీరికి నాదస్వర మృదు మధుర గాన సుధార్ణవ బిరుదును ఇచ్చారు. కోట ప్పకొండ, సొలస గ్రామాలలో వీరికి స్వర్ల కంకణాలను బహుకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఘనంగా సన్మానించింది. హుస్సేన్సాహెబ్ టీటీడీ ప్రత్యేక నాదస్వర విద్వాంసులుగా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/కనపర్తి_సోదరులు" నుండి వెలికితీశారు