రాకేష్ రోషన్: కూర్పుల మధ్య తేడాలు

"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 13:
=== 1990-ఇప్పటివరకు ===
[[దస్త్రం:_Rakesh_Roshan,_Thakur_Doultani_&_Hrithik_Roshan.jpg|thumb|కుమారుడు [[హృతిక్ రోషన్]], ఠాకూర్ దౌల్తానిలతో రాకేష్ రోషన్]]
రాకేష్ కు దర్శకునిగా ఖుద్గర్జ్(1987) మొదటి సినిమా. ఆ తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఖూన్ భారీ మాంగ్(1988), కిషన్ ఖన్నయ్యా(1990), కరణ్ అర్జున్(1995) వంటి హిట్లు సాధించారు ఆయన. 1990-1999 మధ్యకాలంలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు మాత్రమే చేశారు. ఆ సమయంలో ఎక్కువగా దర్శకత్వం పైనే దృష్టి పెట్టారు రాకేష్. తన కుమారుడు హృతిక్ ను స్వంత దర్శకత్వంలో, నిర్మాణంలో తీసిన కహో నా.. ప్యార్ హై(2000) సినిమాతో తెరంగేట్రం చేయించారు రాకేష్. ఆ సంవత్సరానికి అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమా ఇదే కావడం ఒక విశేషమైతే, లిమ్కా బుక్ తో సహా అతి ఎక్కువ అవార్డులు సాధించిన బాలీవుడ్ సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. 2003లో మళ్ళీ తన కుమారుడు హీరోగా కోయీ.. మిల్ గయా సినిమాకు దర్శకత్వం వహించారు ఆయన. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం అందుకున్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/filmfare-awards-2004-winners-list-news-bollywood-kkfvNnffjfa.html|title=Filmfare Awards 2004: Winners List|accessdate=21 July 2012}}</ref> దీనికి సీక్వెల్ గా వచ్చిన క్రిష్(2006)కూడా పెద్ద హిట్ అయింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=127&catName=MjAwMC0yMDA5|title=Boxofficeindia.com|date=|accessdate=29 June 2011|publisher=Boxofficeindia.com}}</ref> 2008లో క్రేజీ4 సినిమాను నిర్మించారు. 2010లో కైట్స్ సినిమాను విడుదల చేశారు రాకేష్. ఈ సినిమానే బ్రెట్ రాట్నర్ ప్రెజంట్స్ కైట్స్: ది రీమిక్స్ పేరుతో అంతర్జాతీయంగా విడుదల చేశారు. తాజాగా కుమారుడు విడాకులు తీసుకోవడంతో బాధకు గురైన రాకేష్, "K" అక్షరంతో మొదలయ్యే సినిమా పేర్ల సెంటిమెంట్ ను పక్కకు పెట్టి బంధాల గురించి తెలిపే కథతో "జుదాయీ.. మతలబ్ ప్యార్ హై" టైటిల్ తో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా 2017 విడుదల కావచ్చు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/రాకేష్_రోషన్" నుండి వెలికితీశారు