వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
వారన్ హేస్టింగ్సు జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. క్రీ.శ 1599 లో స్థాపించినప్పటినుండీ బ్రిటిష్ ఈస్టు ఇండియా వ్యాపారకంపెనీ కి పది-పదిహేను సంవత్సరముల కొకమారు ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము సన్నదులు (పట్టా) ద్వారా ( ఉదాహరణకు 1661,1676,1686 చేసిన సన్నదులు.1686 లో శాసన నిర్మాణాధికారము ఇచ్చారు,1767 లో అమలుచేసిన కంపెనీ పట్టా చట్టం) ఇత్యాతులు వ్యాపారనిర్వాహణ నిమిత్తం అన్న ఆర్భాటంతో అనేక పరిపాలనాధికారములను క్రమేణా కలిగించారు. ఇవన్నీ బ్రిటిష్ రాజ్యతంత్రములోభాగములే. 1773 లో ఇంకా అధిక మోతాదులో అధికారమిస్తూ రెగ్యులేటింగ్ చట్టం అని అమలుచేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ కి కలకత్తా లో గవర్నర్ జనరల్ పదవి కలుగచేసి బ్రిటన్ దేశ రాజ్యప్రతినిధినిగా నియమించటం జరిగింది. పరిపాలనా సంఘ(గవర్నింగ్ కౌన్సిల్ ) సభ్యత్వం నలుగురినే చేశారు. ఆ చట్టప్రకారం బీహారు ఒరిస్సా రాష్టములు గూడా గవర్నర్ జనరల్ పరిపాలనాధికారంలోకి వచ్చినవి. అంతే కాక మద్రాసు, బొంబాయి రాష్ట్ర గవర్నర్లులుపై తనిఖీకి అధికారము, రాజ్యపాలిత ఇతర అధికారములు ఇవ్వబడ్డాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు నియమించబడింది. ఆ చట్టముక్రింద అప్పటిలోకలకత్తాలో గవర్నరు గానున్న వారన్ హేస్టింగ్సు(WARREN HASTINGS) మొట్టమొదటి గవర్నర్ జనరల్ పదవిలో 1773 నుండీ 1785 దాకా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని వారిద్వారా బ్రిటిష్ వలసరాజ్యమును పరిపాలించాడు.<ref name= “దిగవల్లి (1938)”> “The British Rule in India”. D.V. SIVA RAO. ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల బెజవాడ.02/10/1938.</ref>
==వ్యక్తిగతముఖ్యాంశాలు==
వారన్ హేస్టింగ్సు వ్యక్తిగతంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 1732 డిసెంబరు 6 తేదీన ఇంగ్లండులోని చర్చిల్(CHURCHILL) దగ్గర గ్రామంలో ఒక బీదకుటుంబమున జన్నించిజన్మించి చిన్ననాటనే తల్లిని కొల్పోయాడు. తండ్రి, పినాస్టన్ హేస్టింగ్సు (PYNASTON HASTINGS)కూడా దూరమైపోవటం వల్ల కొంతకాలం ధర్మసంస్థల, అనాధ పాఠశాలలో చదివి, తరువాత బంధువుల పర్యవేక్షణలో పెరిగి లండన్ నగరములోనున్నప్రముఖమైన (WESTMINSTER) పాఠశాలలో విద్యార్ధి గాచదువుతూ చదువు పూర్తికాకముందే కుటుంబ ఆర్ధిక కారణములవల్ల 17 వ ఏటనే 1750లో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వంగరాష్ట్ర ముఖ్య కేంద్రమైన కలకత్తా లో గుమాస్తాగా(writer) ప్రవేశించాడు. స్వంతవ్యాపారాలు సర్వసాధారణమైన ఆరోజులలో తనుగూడా కొంత వ్యాపారంచేశాడు. 1753 లో వంగరాష్ట్రములో పనిచేస్తున్న కాలంలో వంగరాష్ట్ర నవాబు సురజ్ ఉద్దౌలా 1757 లో కలకత్తా ముట్టడించినప్పడు బందీ గా పట్టుబడి ముర్షీదాబాదులో బంధించబడి తప్పించుకుని ఆంగ్లేయులున్న హుగ్లీ నదీతీరందగ్గర ఫాల్టాకు చేరుకుని అక్కడవున్న రోజులలోనే మేరీ బుక్నాన్ ( Mary Buchanan) తో వివాహంచేసుకున్నాడు. దురదృష్టవశాన అతని భార్య1759 లోనూ, తరువాత కుమారులు కూడా చిన్నవయస్సులోనే మరణించారు. తరువాత 1777 లో జర్మనీదేశస్తురాలగు ఇమ్హాఫ్ (Baroness IMHOFF) ను వివాహముచేసుకున్నాడు. వంగరాష్ట్రమే హేస్టింగ్సుకు కర్మభూమైనది. వంగరాష్ట్రపు కంపెనీ కౌన్సిల్ లోని ఆంతరంగిక వ్యాకుల పరిస్తితుల వల్ల 1765లో రాజీనామా చేసి ఇంగ్లండుకు తరలిపోయాడు.ఆర్ధిక ఇబ్బందులవల్ల మూడేండ్ల తరువాత 1768 లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. 1769లో చెన్నపట్నంలోని కంపెనీవారి కౌన్సిల్లోసభ్యునిగా వచ్చాడు. తరువాత వృత్తిరీత్యా త్వరితగతి పదోన్నతులతో గవర్నరుగానూ, గవర్నరు జనరల్ గానూ అత్యున్న పదవికి చేరుకున్నప్పటికీ కార్యకాలం చివరిలో (1785) పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కార్యవిముక్తి అనంతరం చాల తంటాలుఎదురుపడినవి. బ్రిటిష్ ఇండియాలోతన కార్యకాలం జరిగిన అక్రమబధ్ధమైన ఆర్ధిక, రాజకీయ పనులకు అతనిని భాధ్యితునిగా నేరారోపణజరిగింది. లండన్ లో కామన్సు సభ్యులుగానున్న ఫిలిప్ ఫ్రాన్సిస్, జేమ్సు ఫాక్సు, ఎడ్మండ్ బర్కే దొరల ఆరోపణలు,అక్రమసంపాదన,రాజ్య దుష్పరిపాలన మొదలగు ఆక్షేపణలపై (impeachment) సంవత్సరములతరబడి జరిగిన విచారణ తరువాత చివరకు నేరవిముక్తుడు గా ఘోషించబడి బయటపడ్డాడు. కానీ వృధ్దాప్యంలో ఆర్దిక ఇబ్బందులకు గురై ప్రభుత్వమువారిని మనోవర్తి యాచించి 86 వ ఏట 1818 ఆగస్టు 22తేదీన ఇంగ్లండులోని డెల్స్ ఫర్ట్(DAYLESFORD) గ్రామము లో మరణించాడు. సశేషం. <ref name= “Britannica(1926)> The Encyclopedia Britannica, 13th Edition(1926). Pp 244-247</ref>
 
==కార్యకాల ముఖ్యాంశాలు==
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు