దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
==అవధాన ప్రస్థానం==
ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో గుంటూరు ఆవధానాలు, చీరాల అవధానం, జాండ్రపేట అవధానం, మద్రాసు అవధానం, రాజమండ్రి అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=165-170|edition=ప్రథమ|accessdate=23 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
ఇతడు పూరించిన కొన్ని అవధాన పద్యాలు:
* సమస్య: నిద్రాదేవత నిన్ను బూనె గదరా! నిర్భాగ్యదామోదరా!
పూరణ:<poem>భద్రంబౌ శశిబింబముం దెగడగా నేపాఱనౌమోము, న
క్షుద్రంబైన జలేజముల్ కనులు; సంకోచంబు లేకుండు ని
ర్ణిద్రం జెందెను యౌవనంబు సతికిన్; నీరీతి నిం గాంచ నీ
నిద్రాదేవత నిన్ను బూనె గదరా! నిర్భాగ్యదామోదరా!
</poem>
 
* సమస్య: ఈ శునకము కృష్ణుచేత నెన్నఁగఁబడియెన్
పూరణ:<poem>పేశలతా రహితుఁడు భూ
మీఁశుడు ధృతరాష్ట్రు సభను నెడ పాండుక్ష్మా
ధీశు కుమారుల కొఱకై
యీశునకము కృష్ణుచేత నెన్నఁగఁబడియెన్
</poem>
 
==రచనలు==