వేలూరి శివరామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==బాల్యం, విద్య==
వేలూరి శివరామశాస్త్రి [[కృష్ణా జిల్లా]] చిరివాడలో[[చిరివాడ]]లో 1892లో విశాలాక్షి, వెంకటేశ్వరావధానులు అనే దంపతులకు జన్మించారు. చిన్నతనం లోనే వేదవేదాంగాలలో షట్శాస్త్రాలను ఔపోషన పట్టారు. ఇంగ్లీషు, ఫ్రెంచి తదితర విదేశీ భాషలను, బెంగాలీ, గుజరాతీ, హిందీ తదితర భారతీయ భాషల్లో పాండిత్యం సాధించారు. యోగం, సాంఖ్యం, వేదాంతం, జ్యోతిష్యం, మొదలైన శాస్త్రాలలో ఆయన పరిశ్రమ నిరుపమానం. వ్యాకరణంలో ఆయన్ని మించిన వారు ఆ కాలంలో లేరన్నది ప్రతీతి. ఒక పర్యాయం గుంటూరులో [[కొప్పరపు సోదరకవులు|కొప్పరపు సోదర కవులకు]], [[తిరుపతి వేంకటకవులు|తిరుపతి వేంకట కవులకు]] విద్యా వివాదం సంభవించింది. ఆ వివాదం చివరకు ముదిరి ఎవరు ఏమిటో తేలిపోవాలన్న దశకు చేరుకుంది. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరులకన్నా అన్నిటిలో మిన్నే అయినా ఆశు కవిత్వంలో మాత్రం ఒక వాసి తక్కువే అని అప్పట్లో అనుకొనేవారు. వేలూరికి పద్దెనిమిదేళ్ళ వయసులో వారి గురువులైన తిరుపతి వేంకటకవులకు, కొప్పరపు సోదరులతో వివాదం జరిగింది. ఆశు కవిత్వంలో తమ గురువుల పక్షాన కొప్పరపు సోదరులను ఢీకొని అందర్నీ మెప్పించారు. తొలిసారిగా ఆయన విద్వత్తు సభికులకు అక్కడే పరిచయమైంది. ఆ తర్వాత ఆయన వెనుదిరగలేదు. తన గురువుల దారిలోనే నడుస్తూ ఆంధ్రదేశంలో అన్ని నగరాల్లో అష్టావధానాలు, శతావధానాలు చేసి గురువులకు తగిన శిష్యుడిగా గుర్తింపు పొందారు. కథకుడిగా వేలూరి తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. వస్తువులో ఎంతో వైవిధ్యం, యుగయుగాల మనుష్యులు, రకరకాల మనస్తత్వాలు, ఆనాటి చారిత్రక రాజకీయ ఉద్యమాలు, సామాజిక సమస్యలు, భావ సంఘర్షణలు... ఇవన్నీ ఆయన కథల్లో కనిపిస్తాయి.
 
==రచనలు, శైలి==