జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==అవధానాలు==
ఇతడు మంతెన, చెన్నూరు, లింగాపురం, వేములవాడ, కమాన్‌పురం, కరీంనగర్‌లలో శతావధానాలు, యాదగిరిగుట్ట, నల్లగొండ, సింగవరం, దైవముదిన్నె, ఇల్లెందు, గురజాల, హనుమకొండ, మంథెన, కొల్లాపురము, గద్వాల, నూజివీడు, మిర్యాలగూడ, నారాయణపేట, బళ్లారి, జగిత్యాల, గోపాల్‌పేట, శ్రీశైలము, చల్లపల్లి, కరీంనగర్, కూనవరము, భీమవరము మొదలైన చోట్ల సహస్రావధానాలు చేశాడు. హనుమకొండలో 1954లో పంచసహస్రావధానాన్ని నిర్వహించాడు.
 
ఇతడి అవధానాలలో మచ్చుకు కొన్ని పూరణలు:
* సమస్య: రాతిరి సూర్యుండు నంబరమ్మున దోచెన్
పూరణ:<poem>ఆతత కాసారము ల
బ్జాత మనోజ్ఞంబులయ్యె జక్రము లెల్లన్
గావర ముడిగెను, ముగిసెన్
రాతిరి, సూర్యుండు నంబరమ్మున దోచెన్
</poem>
* సమస్య: పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు
పూరణ:<poem>బ్రహ్మవిజ్ఞాన హేతు భావప్రబోధి
నిత్యకర్మాభి నిరతుడే ద్విజుడు కాని
యగునె కలుద్రావ జందెమ్ము లవల ద్రోసి
పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు
</poem>
* సమస్య: బంగ్లా మీదికి ద్రోవజూపగదవే భామా కురంగేక్షణా
పూరణ:<poem>ఆంగ్లేయాభినిదత్త యంత్ర శకట వ్యాపారముంజేసి తా
బెంగ్లానిందొరగారు వచ్చెనదిగో వేవేగ నీచెంగటన్
బంగ్లాపై దొరసాని యున్నదట నాపైనన్ం దయంబూని యా
బంగ్లా మీదికి ద్రోవజూపగదవే భామా కురంగేక్షణా!
</poem>
* వర్ణన: కాళిదాసు
<poem>ఘనసారస్వతలోకమాన్య రసవత్కావ్యంబులన్ వ్రాసి స
జ్జన మాన్యంబగు భావలోకమున సత్థ్యానంబునుంబూని పృ
థ్విని నశ్రాంతయశంబు నిల్పిన సుధీవరుండు తత్కాళిదా
సుని గీర్తించెద నస్మదీయ కవితా శోభాభిసంవృద్ధికై
</poem>
 
==సత్కారాలు,బిరుదులు==