ఎడారి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
==ఎడారిమొక్కలలో అనుకూలనాలు==
===బాహ్యస్వరూప లక్షణాలు===
* '''వేళ్ళు''' బాగా విస్తరించి కొన్ని మొక్కలలో కాండం కంటే ఎక్కువ రెట్లు పొడవుగా ఉంటాయి. మూలకేశాలు, వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* '''కాండాలు''' చాలా వరకు పొట్టిగా, దృఢంగా, చేవదేరి, మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి. కొన్ని మొక్కలలో కాండం భూగర్భంగా ఉంటుంది. కాని ఒపన్షియా, యుఫర్బియా లలో రసభరితంగా హరితం కలిగి ఉంటాయి. కాండాలు సాధారణంగా కేశాలు, జిగురు పొరచే కప్పబడి ఉంటాయి.
* '''పత్రాలు''' బాగా క్షీణించి, పరిమాణంలో చిన్నవిగా, పొలుసాకులవలె కొద్దికాలం మాత్రమే ఉంటాయి. కొన్ని సార్లు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. పత్రదళం సన్నగా, పొడవుగా, సూదులవలె గాని లేదా అకేసియాలో అనేక పత్రకాలుగా చీలిగాని ఉంటుంది. సాధారణ హరితపత్రాలుంటే, అవి మందంగా, రసభరితంగా లేదా గట్టిగా చర్మంలాగా ఉంటాయి. ఉదా: అలో. పత్ర ఉపరితలం మెరుస్తూ, సన్నగా ఉండి, కాంతిని, వేడిని పరావర్తనం చెందిస్తాయి. ఉదా: కెలోట్రోపిస్. అమ్మోఫిలా వంటి ఏకదళబీజ మొక్కలలో పత్రాలు మడతబడి, చుట్టుకొని ఉంటాయి. తద్వారా పత్రరంధ్రాలు దాగిఉండి భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. యుఫోర్బియా, జిజిపస్ జుజుబా వంటి మొక్కలలో పత్రపుచ్ఛాలు కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి.
 
===అంతర్నిర్మాణ లక్షణాలు===
 
"https://te.wikipedia.org/wiki/ఎడారి_మొక్కలు" నుండి వెలికితీశారు