"సౌమనశ్య రామ్మోహనరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with 'ఆకాశవాణి కళాకారునిగా రాష్ట్రంలోని శ్రోతలంద రికి సుపరిచితు...')
 
ఆకాశవాణి కళాకారునిగా రాష్ట్రంలోని శ్రోతలంద రికి సుపరిచితుడైన కళాకారులు, దర్శకులు. సౌమనశ్యమూర్తి రామ్మోహనరావు<ref>http://epaper.andhrajyothy.com/c/12021265</ref>
 
గుంటూరు జిల్లా చినపులివర్రులో 1921లో రామ్మోహనరావు జన్మిం చారు. తెనాలి రామవిలాస సభలో రిహార్సల్స్కు తండ్రితోపాటు వెళ్లే రామ్మోహనరావు నాటక రంగం వైపు ఆకర్షితులయ్యారు. శ్రీకృష్ణ రాయ
భారం నాటకంలో విదుర పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన రామ్మోహనరావు భక్తరామదాసు, కబీరు, ప్రతాపరుద్రీయం, బాలనాగమ్మ, పన్నా శాక్య సింహ వంటి నాటకాలలో ముఖ్య భూమికలను పోషించారు. బాప ట్లలో వడ్లమూడి సీతారామారావు స్థాపించిన జాతీయ నాటక కళా మందిర్లో సభ్యుడిగా తారాబలం, విశ్వంపెళ్లి, రాబందులు వంటి నాట కాలలో నటించారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఉత్తమ క్యారె క్టర్ యాక్టర్గా బహుమతి పొందారు. మహానటుడు బందాతో కలిసి చిత్రనళీయం, అలూరి సీతారామరాజు, పాదుకా పట్టాభిషేకం వంటి నాటకాలను రాష్రంలోని పలు ప్రాంతాలతోపాటు కలకత్తా, బిలాస పూర్, ఖరగ్ పూర్ వంటి ప్రాంతాలలో కూడా ప్రదర్శించారు. 1961లో ఏషియన్ థియేటర్, ఢిల్లీ భారతీయ నాట్యసంఘం ఢిల్లీలో నిర్వహిం చిన నాటక శిబిరంలో శిక్షణ పొందారు. ఢిల్లీలో కె వెంకటేశ్వరరావుతో కలిసి దక్షిణ భారత నటీనట సమాఖ్యను స్థాపించి ఆకాశరామన్న గుడ్డిలోకం, కప్పలు వంటి నాటకాలను ప్రదర్శించారు. సుంకర కనకా రావు విజయవాడలో నెలకొల్పిన అరుణోదయ నాట్యమండలిలో సభ్యుడిగా యోగి వేమన నాటకంలో వేమన పాత్రను పోషించారు. అయ్యప్ప, కన్యకాపరమేశ్వరి, భక్తసిరియాళ వంటి నాటకాలను స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వందలాది నాటకాలలో కీలక పాత్రలను పోషించారు. 1990 జూలై 21న రామ్మోహనరావు పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923173" నుండి వెలికితీశారు