"రంజిత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780&nbsp;– 27 జూన్ 1839),<ref name=eos/><ref name=britranjit/> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో 21 సంవత్సరాలకే పంజాబ్ మహారాజాగా ప్రకటించుకోగలిగారు.<ref name=eos/><ref name="Singh2008p9"/> ఆయన నాయకత్వంలో 1839 వరకూ ఆయన సామ్రాజ్యం [[పంజాబ్ ప్రాంతం]]లో విస్తరించింది.<ref name="Encyclopædia Britannica Eleventh Edition 1911 Page 892">Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910-1911), Page 892.</ref><ref name="Grewal6">{{cite book|last=Grewal|first=J. S.|title=The Sikh empire (1799–1849) |publisher=Cambridge University Press|year=1990|series=The New Cambridge History of India|volume=The Sikhs of the Punjab|chapter=Chapter 6: The Sikh empire (1799–1849)|url=http://histories.cambridge.org/extract?id=chol9780521268844_CHOL9780521268844A008}}</ref>
 
రంజీత్ సింగ్ రాజ్యాన్ని సాధించడానికి ముందు పంజాబ్ అనేక వివాదగ్రస్తతమైన మిస్ల్(సమాఖ్య) ల చేతిలో ఉండేది. వాటిలో పన్నెండింటిని సిక్ఖు పాలకులు, ఒకదాన్ని ముస్లింలు పరిపాలించేవారు.<ref name="Singh2008p9"/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923217" నుండి వెలికితీశారు