సిక్ఖు సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో [[ఔరంగజేబు]] మరణం, [[ముఘల్ సామ్రాజ్యం|ముఘల్ సామ్రాజ్య]] [[ముఘల్ సామ్రాజ్య పతనం|పతనం]] నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన [[పష్తూన్|ఆఫ్ఘాన్ల]]పై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు.
 
లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు [[జమాన్ షా అబ్దాలీ]] నుంచి గెలుచుకుని, [[ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధం|ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో]] ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది. 12 ఏప్రిల్ 1801న వైశాఖి పండుగ నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు.<ref>[http://www.learnpunjabi.org/eos/ The Encyclopaedia of Sikhism], section ''Sāhib Siṅgh Bedī, Bābā (1756–1834)''.</ref>
"https://te.wikipedia.org/wiki/సిక్ఖు_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు