"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

తన దర్శకత్వంలోని మొట్టమొదటి సినిమా [[శుభమస్తు]] తోనే విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుని తర్వాత ఆరు సినిమాలని సూపర్ హిట్ చెయ్యడమే కాకుండా అనతికాలంలోనే నిర్మాతగా కూడా మారి అందులోనూ విజయంసాధించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు.
==బాల్యము==
వీరిది [[గుంటూరు జిల్లాలోజిల్లా]]లో [[తాతపూడి (చిలకలూరిపేట)|తాటపూడి]] అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ వీరి కుటుంబం. వీళ్ళది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాసులేం లేవు. అమ్మ, నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి వీరిని పెంచి పెద్దవాళ్ళని చేశారు. వీళ్ళు చదువుకోవటానికి కష్టపడాల్సివచ్చింది. ఎందుకంటే ప్రాధమిక పాఠశాల వరకూ ఊళ్ళోనే ఉన్నా, ఉన్నత పాఠశాల చదువు కోసం పక్కనే ఉన్న [[మురికిపూడి]] వెళ్ళాల్సివచ్చింది. కొంతకాలం కాలినడక, మరికొంతకాలం సైకిల్ ప్రయాణం. ఉదయం క్యారేజీ తీసుకెళ్లే, మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేది మరుసటి రోజు ఉదయమే. సాయంత్రం వరకూ స్కూలు, రాత్రి ట్యూషన్ - మధ్యలో ఖాళీ దొరికితే లైబ్రరీ. హెస్కూల్ వరకూ చదువు బాగానే సాగింది. టీనేజ్ లో మనల్ని ప్రభావితం చేసే అంశాలే మన జీవితగమనాన్ని నిర్దేశిస్తాయంటారు. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ జీవరత్నం గారబ్బాయి బుల్లిబాబు ఇతని క్లాస్ మేట్. తెలిసీతెలియని వయసులో సినిమా అనే బీజాక్షరాలు నాలో నాటుకోవడానికి మొదటి కారకుడిగా అతన్నే చెప్పుకోవాలి. వాళ్ళ మేనమామ రాజారెడ్డి హెదరాబాద్ లో సినీపరిశ్రమ వేళ్ళూనకముందునుంచే ప్రయత్నాలు చేస్తుండేవాడని చెవిలో ఇల్లు కట్టుకొని చెబుతుండేవాడు. అలా ప్రారంభమైన ఇంటరెస్టు తప్పటడుగులేసుకుంటూ కధల్లోకి, కవితల్లోకి, నవలల్లోకి ఎంటరై నాటకాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చదువు తడబడి అత్తెసరు మార్కులతో స్కూల్ ఫైనల్ అయిందనిపించాడు. అసలు ప్రస్థానం ఇప్పుడే అప్పుడే రెక్కలొచ్చిన పక్షులు ఎగరడంలో ఉన్న ఆనందాన్ని స్వేచ్ఛలో ఉన్న అనుభూతిని ఫీలయినట్టే అనిపించింది కాలేజ్ కి వెళ్ళిన కొత్తలో, ఇతడు డాక్టర్నవుదామనుకొని దర్శకుడయ్యాడు . దానికి నిదర్శనం ఇంటర్ లో బైపీసీ తీసుకోవడమే. ఇంకా అసలు విషయానికొస్తే ఇక్కడినుంచీ చదువేమో బ్యాక్ బెంచీకి సినిమా ఫ్రంట్ సీటుకీ షిఫ్టయ్యాయి. ఇంట్లో వాళ్ళకి ఇతడి పరిస్థితి అర్థమయింది. చాలా తర్జన భర్జనల తర్వాత ఇతడి మకాం మద్రాసుకి మారి ప్రస్థానం సినిమాల్లోకి మారింది. దీనివెనక సోదరతుల్యులు శ్రేయోభిలాషి కందిమల్ల నారాయణమూర్తి ప్రోత్సాహం అన్నయ్య వెంకట్రావు పెదనాన్న కొడుకు స్వాములు అన్నయ్య సహకారం ఉంది. <ref name="మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు|last1=శ్రీనివాసరావు|first1=భీమినేని |last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
 
==మొదటి సినిమా ==
1,88,787

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1924493" నుండి వెలికితీశారు