వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
పంక్తి 1:
వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి [[Special:Userlogin|లాగిన్]] కానవసరము లేనే లేదు. ''ఎవరైనా'', ఎప్పుడైనా [[వికీపీడియా:సంరక్షిత పేజీలు|దాదాపుగా]] అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైనది, క్షణాలలో చేయగలిగినది, ఉచితమైనదీను. ఇది చాలా చాలా మంచి ఆలోచన అని చెప్పడానికి అనేక రకాల కారణాలున్నాయి.
 
''గమనిక: వికీపీడియా సభ్య ఎకౌంటు సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్
== సభ్యనామం ==
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[వికీపీడియా:సభ్యనామము|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) [[ఐ పీ అడ్రసు|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.
 
మీకు మీ సొంత ''[[వికీపీడియా:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.
 
మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ''గోపనీయమైనది''. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.
 
== ప్రసిద్ధీ, గోప్యతా ==
'''మీరు మీ నిజ జీవితపు గుర్తింపును తెలియపరచనవసరం లేదు''', కానీ ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తింపును ఎకౌంటు మీకు ఇస్తుంది. లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియజేస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తింపు) మీతో సంభాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాతవారికి సులభంగా [[వికీపీడియా:Assume good faith|విశ్వాసం]] కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకుండే స్వేచ్ఛ తగ్గుతుంది.
 
వికీపీడియాలో దురుపయోగం చెయ్యటం, స్పామింగు చెయ్యటం, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ రాసే సమాచారపు మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్నీ నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.
 
మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే మార్పుచేర్పులన్నీ, అప్పటి మీ [[ఐ పీ అడ్రసు]] కు చెందుతాయి. లాగిన్ అయివుంటే అవి బహిరంగంగా మీపేరుకు, అంతర్గతంగా మీ ఐ.పి.అడ్రసుకు చెందుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కొరకు [[Wikimedia:Privacy policy|వికీమీడియా గోప్యతా విధానము]] చూడండి.
 
మీ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియాలో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.
 
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే [[:en:MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు ఎన్నో వున్నాయి. ఉదాహరణకు, చేసిన మార్పుచేర్పులు 'చిన్న'వని గుర్తు పెట్టగలగడం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. చిన్న మార్పులు కానివాటిని కూడా చిన్నవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాం. కాబట్టి, కేవలం వ్యాకరణదోషాల సవరణల వంటి వాటిని మాత్రమే చిన్న మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు ఐ.పి.అడ్రసు చాటుగా వుంటారు కనుక, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుకా చిన్నమార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వారా విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.
 
చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం '''[[వికీపీడియా:వీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]'''. మీరు చూసే ప్రతి పేజీ లోను "వీక్షించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.
 
నమోదైన సభ్యులు మాత్రమే పేజీల [[వికీపీడియా:పేజీ పేరు మార్చడం లేదా తరలించడం|పేరు మార్పు]]చెయ్యగలరు. వికీపీడియా ఆకారాన్నీ, దాని ప్రామాణికతనూ చెక్కు చెదరకుండా వుంచటానికి ఇది చాలా ముఖ్యం.
 
ఇంకా, [[Special:Upload|బొమ్మలు అప్‌ లోడు]] చెయ్యాలంటే మీరు లాగిన్ అవ్వవలసిందే.
 
== సభ్యుని అభిరుచులు ఎన్నో ==
పై విశేషాలతో పాటు, మీడియావికీ ఆకృతిని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అసలు వెబ్‌ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. ఉదాహరణకు.., ఇప్పుడున్న "మోనోబ్లాక్‌" రూపు స్థానంలో ఇదివరకటి "స్టాండర్డ్" రూపును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, దిద్దుబాటు పెట్టె (ఎడిట్ బాక్స్) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇలా ఇంకా ఎన్నో.
 
==నిర్వాహకుడి హోదా==
[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం, సంరక్షించినవాటిని మార్చడం, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు [[వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు]] వంటి పేజీల్లో వికీ అభిమతాన్ని అమలుచేస్తూ వుంటారు.
 
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్నినెలల పాటు వికీపీడియాలో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండివుంటే నిర్వాహకుడు కావడానికి సరిపోతుంది.
 
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]]''' చూడండి.
 
== ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు.. ==
వికీపీడియాలోని చాలా పోలింగులలో ఎవరైనా - లాగిన్ అయినా కాకున్నా - తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ అదే అభిప్రాయం ఒక చక్కని దిద్దుబాటు చరితం కలిగిన సభ్యునికి చెందినదైతే దానికి మరింత విలువ వుంటుంది. కొన్ని పోలుల లోనైతే, మీ వోటును పరిగణించాలంటే, మీరు నమోదైన సభ్యుడు అయి వుండాలనే నియమం ఉంది. నమోదు కాని వారు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
 
వికీమీడియా బోర్డులో వాడుకరుల ప్రతినిధులు ఇద్దరు వుంటారు - ఒకరు "అందరు" వాడుకరులకు, మరొకరు సభ్యులైన వాడుకరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, మీరు సభ్యులయి వుంటే, వివాదాలు వచ్చినప్పుడు, మీకు, బోర్డుకు మధ్యవర్తిత్వం కోసం మీరు (ఇద్దరిలో ఒకరిని) ఎంచుకొనటానికి అవకాశం వుంటుంది.
 
==ఇంకా చూడండి==
*[[వికీపీడియా:అకౌంటు తొలగింపు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|అకౌంటు]]
 
[[de:Wikipedia:Anmeldung]]
[[th:วิกิพีเดีย:ทำไมจึงควรสร้างบัญชีผู้ใช้?]]