ప్రాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఒక [[పద్యం]]లోని ప్రతి [[పాదం]] లోని రెండవ అక్షరాన్ని '''ప్రాస''' అంటారు. మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు.
 
==నియమాలు==
తెలుగులో వృత్తాలలో,
* ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
కంద పద్యంలో అన్ని పాదాలలో ప్రాసాక్షరం ఒక్కటే ఉండాలనేది నియమం. ప్రాసాక్షరం అన్ని పాదాలలోనూ ఒకే గుణింతంలో ఉండనక్కరలేదు.
* ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
* ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
* ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
* ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.
 
 
==తెలుగు పద్యరీతులలో==
* వృత్తాలలో [[ఉత్పలమాల]], [[చంపకమాల]], [[మత్తేభ విక్రీడితము|మత్తేభం]], [[శార్దూల విక్రీడితము|శార్దూలం]], [[తరలము]], [[మత్తకోకిల]] వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను.
* జాతులలో [[కందం|కంద]] మరియు [[తరువోజ]] పద్యాలలో ప్రాస నియమము వుంది. [[ద్విపద]]లో ప్రాసనియమము వున్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.
* [[ఆటవెలది]], [[తేటగీతి]], [[సీసము]] వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, [[ప్రాస యతి]] చెల్లును.
 
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/ప్రాస" నుండి వెలికితీశారు