ఉలవలు: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
ఎక్కిళ్ళు, నేత్రరోగములు వీని నణచును; మూత్రము గావించును; ఋతురక్తమును జారీజేయును; నల్లదబ్బతో (Spleen)పుట్టెడు కంతులను హరించును; కడుపు నొప్పిని పోగొట్టును; ముల్లంగియాకు రసముతో నిచ్చిన మూత్రపుసంచిలోని (Bladder)రాయి పడిపోవును. ఉలవ కషాయముతో కాచినచారు (ఉలవచారు) పైనచెప్పిన రోగులకు పథ్యముగ నుండును. ఉలవ కట్టు :- Boilings of horse gram. వగరుగా, రుచిగా నుండును. వాతము, తూనివాతము, ప్రతూనివాతము, అనులోమవాతము, గుల్మము, ఉదరరోగము, మధుమేహము, మూత్రాశ్మరి, శ్లేష్మము, శూల, క్షయ, శ్వాస, కాస, గుదరోగము బోగొట్టును ఆయు్ర్వేదము : మూలము : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద ఉలవలతో కులత్థాద్వఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్థయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి.
==ప్రోటీన్ ఎక్కువ==
ఉలవల్లో [[ప్రోటీన్]] ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి. * ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. * మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి. * ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి. ఔషధోపయోగాలు స్థూలకాయం: ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. బోదకాలు, కాళ్లవాపు: ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది. లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
 
==మూత్రంలో చురుకు, మంట:==
1,96,471

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1928924" నుండి వెలికితీశారు