త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ: Tripuraneni Ramaswami Chaudari.jpg|thumb|right|225px|<center>[[బొమ్మ:TripuranEni raamaswamichaudari text.jpg|225px|త్రిపురనేని రామస్వామిచౌదరి ]]<center> ]]
'''కవిరాజు'''గా ప్రసిద్ధి చెందిన '''త్రిపురనేని రామస్వామి చౌదరి ''' ([[జనవరి 15]], [[1887]] - [[జనవరి 16]], [[1943]]) న్యాయవాది మరియు ప్రముఖ [[హేతువాదం|హేతువాద]] రచయిత, సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజు గా పిలువబడే అతను [[హేతువాదం]] మరియు [[మానవతావాదం]] తెలుగు కవిత్వం మరియు సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి [[1887]] [[జనవరి 15]] న [[కృష్ణా జిల్లా]], [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు.[[రామ్ మోహన్ రాయ్]] , [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]] , [[రనడే]] , [[దయానంద సరస్వతి]] మొదలగువారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.
 
==బాల్యము మరియు తొలి నాళ్లు==
రామస్వామి చౌదరి [[రైతు]] కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన [[పల్నాటి యుద్ధము]] ఆధారముగా ''కారెంపూడి కదనం'', [[మహాభారతం|మహాభారత]] యుద్ధము ఆధారముగా ''కురుక్షేత్ర సంగ్రామము'' అను రెండు నాటికలు రచించాడు. [[1911]] లో ఇంటర్మీడియట్ చదవడానికి [[బందరు]] లోని [[నోబుల్ కాలేజీ]]లో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.