యాదాటి కాశీపతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
ఇతడు [[తరిమెల నాగిరెడ్డి]] నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పని చేశాడు. సి.పి.ఐ.(ఎం.ఎల్.) ఏర్పడక ముందు కో-ఆర్టినేషన్ కమిటీలో, ఆ తర్వాత చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సి.పి.ఐ.(ఎం.ఎల్.)లో చురుకైన పాత్ర పోషించాడు. 1972లో గుంటూరులో జరిగిన విరసం మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత చైనా మిత్రమండలి, ఎ.పి.సి.ఎల్.సి వ్యవస్థాపకులలో ఇతడు కూడా ఉన్నాడు. వేలాదిమందికి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా రాజకీయ అర్థశాస్త్రాన్ని బోధించడంలో ఇతడికి ఇతడే సాటి. చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో కలిసి పనిచేసిన అనుభవం ఇతడికి ఉంది. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలల పాటు ముషీరాబాద్‌లో జైలు జీవితం గడిపాడు. జైల్లో ఈయనతో పాటు ఉన్న [[వరవరరావు]], ఇతర ముఖ్యనేతలెందరికో రాజకీయ తరగతులను బోధించాడు. సీపీఐ(ఎంఎల్) పార్టీ తరపున [[సిరిసిల్ల]] నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 1978లో శ్రీకాకుళం జిల్లా [[పాతపట్నం]]లో అక్కడే పాటలు పాడే ఓ గిరిజన యువతిని పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు.
===పాత్రికేయ జీవితం===
ఇతడు సి.పి.ఐ.(ఎం.ఎల్.) పార్టీ పత్రిక "'''''విమోచన'''''"కు 1977 నుండి 1979 వరకు సంపాదకుడిగా పనిచేశాడు. జనశక్తి, ప్రజాపంథా పత్రిక సంపాదకమండలిలో సభ్యుడు. సంఘర్షణ అనే పత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు. తరువాత కాలంలో [[ఇండియన్ ఎక్స్‌ప్రెస్]], [[ఆంధ్రప్రభ]], [[వార్త (పత్రిక)|వార్త]]లలో 20 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశాడు. కలర్ చిప్స్ అనే సంస్థలో కొంత కాలం పని చేశాడు.
 
===రచయితగా===
"https://te.wikipedia.org/wiki/యాదాటి_కాశీపతి" నుండి వెలికితీశారు