మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q5725
ప్రదేశం
పంక్తి 1:
'''మొహంజో-దారో''' (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా '''చనిపోయినవారి గుట్ట''' ప్రస్తుత [[పాకిస్థాన్]] లోని [[సింధ్]] ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం [[సింధు లోయ నాగరికత]] లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, [[మెసొపొటేమియా నాగరికత]], మినోవా మరియు నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.
 
== ప్రదేశం ==
సింధు నదికి పడమర దిశగా సింధ్ కు చెందిన లర్కానా జిల్లా లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు. నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి తూర్పు దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు