రఘు కుంచే: కూర్పుల మధ్య తేడాలు

2,497 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| background = solo_singer
| birth_date = జూన్ 13
| origin = గదరాడ[[గాదరాడ]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| occupation = [[సంగీత దర్శకుడు]], [[నేపథ్య గాయకుడు]], [[గేయ రచయిత]], [[నటుడు]], డబ్బింగ్ కళాకారుడు, [[వ్యాఖ్యాత]]
| years_active = 2000–ప్రస్తుతం
}}
 
'''రఘు కుంచే''' ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు మరియు గీత రచయిత. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పని చేశాడు. ప్రతి యేటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే [[నంది అవార్డులనుఅవార్డు]]లను ఐదు సార్లు ఐదు వేర్వేరు విభాగాలలో అందుకున్నాడు.<ref name=ఈనాడుఆదివారం>{{cite web|last1=బెహరా|first1=శరత్ కుమార్|title=ఆ దెయ్యమే నా గురువు!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=5785|website=ఈనాడు.నెట్|publisher=రామోజీ రావు|accessdate=14 August 2016}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గర ఉన్న [[గాదరాడ]] అనే ఊరు. హైస్కూలు చదువు కోసం దగ్గర్లోని [[కోరుకొండ]]కు వెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచి రేడియోలలో పాటలు విని అలాగే పాడటానికి ప్రయత్నించేవాడు. పాఠశాల స్థాయి నుంచి అనేక పాటల పోటీల్లో పాల్గొన్నాడు. పదో తరగతిలో ఉన్నప్పుడు కోరుకొండలో జరిగిన జిల్లా స్థాయి పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. డిగ్రీకి వచ్చేసరికి స్నేహితలంతా గొంతు బాగుండటంతో సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అయితే మొదటగా తండ్రి ఒప్పుకోలేదు. తల్లి మాత్రం ప్రయత్నించమని ప్రోత్సహించింది. అలా డిగ్రీ చదువుతుండగానే సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చాడు.
==కెరీర్==
రైలులో పరిచయమైన ఈసీఐఎల్ ఉద్యోగి రాధాకృష్ణ సహాయంతో సికింద్రాబాదులోని ఒక సంగీత కళాశాలలో చేరాడు. ఒక గదిలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు [[పూరీ జగన్నాథ్]] తో పరిచయం ఏర్పడింది. అప్పటికి జగన్ తనకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి ఒకే గదిలోకి మారారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
33,552

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1930868" నుండి వెలికితీశారు