షారుఖ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

"Shah Rukh Khan" పేజీని అనువదించి సృష్టించారు
"Shah Rukh Khan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''షారుఖ్ ఖాన్''' (జననం 2 నవంబరు 1965)  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆసియాలో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వసూళ్ళు లెక్కలో షారూఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా  నిలిచారు.<ref name="billion" /><ref name="Richest Actors" /><ref name="thetimes1" />
 
1980వ దశకం చివర్లో టివి సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు షారూఖ్. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు ఆయన. కెరీర్ మొదట్లో దార్ర్(1993), [[బాజిగర్]](1993),  అంజామ్(1994) వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్  కామెడీ సినిమాలు దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే(1995), దిల్ తో పాగల్ హై(1997), కుచ్ కుచ్ హోతా హై(1998), మొహొబ్బతే(2000), కభీ ఖుషీ ఖభీ గమ్(2001) సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు షారుఖ్. దేవదాస్(2002), స్వదేశ్(2004), చక్ దే! ఇండియా(2007), మై నేమ్ ఈజ్ ఖాన్(2010) సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు చెన్నై ఎక్స్ ప్రెస్(2013), హ్యాపీ న్యూ ఇయర్(2014) సినిమాలో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆయన సినిమాల్లో దేశభక్తి, సామాజిక సమస్యల గురించి ఎక్కువగా చర్తిస్తారు. సినిమాల్లో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతోనూ,  ఫ్రాన్స్ ప్రభుత్వం ఒర్డరే డెస్ ఆర్ట్స్ ఎట్ దెస్ లెట్టర్స్, లెగియన్ డి ' హానర్ పురస్కారలతో గౌరవించాయి.
 
== Footnotes ==
"https://te.wikipedia.org/wiki/షారుఖ్_ఖాన్" నుండి వెలికితీశారు