ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పర్షియన్ సామ్రాజ్యం నెలకొన్నది. క్రీ.పూ. 330లో అలెగ్జాండర్ దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సెల్యూకస్ అధీనంలో సాగిన వారి రాజ్యం కొద్దికాలమే ఉంది. మౌర్యులు దక్షిణ, ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించి బౌద్ధమతం వ్యాప్తికి కారకులయ్యారు.
[[:en:Anno Domini|క్రీ.శ.]] 1వ శతాబ్దంలో [[:en:Kushan|కుషానులు]] ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి కాలంలో బౌద్ధమతం, సంస్కృతి బాగా వర్ధిల్లాయి. కుషానులను ఓడించి[[:en:Sassanid Empire|సస్సనిద్‌లు]] క్రీ.శ. మూడవ శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు.<ref>Dani, A. H. and B. A. Litvinsky. "The Kushano-Sasanian Kingdom." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996. Paris: UNESCO Publishing, pp. 103–118. ISBN 92-3-103211-9</ref> తరువాత [[:en:Kidarite|కిదరైట్]] హూణుల పాలన ప్రారంభమైంది<ref>Zeimal, E. V. "The Kidarite Kingdom in Central Asia." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996, Paris: UNESCO Publishing, pp. 119–133. ISBN 92-3-103211-9</ref>. వారిని ఓడించిన [[:en:Hephthalites|హెఫ్తాలైట్‌ల]] పాలన కొద్దికాలమే సాగింది. కాని వారి రాజ్యం క్రీ.శ. 5వ శతాబ్దినాటికి చాలా బలమైనది.<ref>Litvinsky, B. A. "The Hephthalite Empire." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996, Paris: UNESCO Publishing, pp. 135–162. ISBN 92-3-103211-9</ref> క్రీ.శ. 557లో557 లో హెఫ్తాలైట్‌లను ఓడించి ససానియన్ రాజు [[:en:Khosrau I|1వ ఖుస్రో]] మరల పెర్షియాలో ససానియన్ బలం పునస్థాపించాడు. కాని కుషానుల, హెఫ్తాలైట్‌ల అనంతర రాజులు [[:en:Kabulistan|కాబూలిస్తాన్]]‌లో [[:en:Kushano-Hephthalites|ఒక చిన్న రాజ్యం]] నిలుపుకొన్నారు. వారిలో చివరివాడైన 'కాబూలి షా'ను జయించి [[:en:Arab|అరబ్బు సైన్యాలు]] ఇస్లామిక్ పాలన ఆరంభం చేశారు.
=== ఇస్లామిక్ విజయం ===
[[:en:Middle Ages|మధ్య యుగంలో]], 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని [[:en:Greater Khorasan|ఖొరాసాన్]] అనేవారు<ref>Ali Akbar Dehkhoda, ''[[Dehkhoda Dictionary]]'', p. 8457</ref><ref>Ghubar, Mir Ghulam Mohammad, ''Khorasan'', 1937 Kabul Printing House, Kabul)</ref><ref>[http://www.tajik-gateway.org/index.phtml?lang=en&id=1005 "Tajikistan Development Gateway"] from ''History of Afghanistan'' by the [http://www.developmentgateway.org/aboutus Development Gateway Foundation]</ref> ఈ కాలంలోనే పలు నగరాలు అభివృద్ధి చెందాయి. ఇస్లాం మతం ఇక్కడ వ్యాప్తి చెందింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వివిధ సామ్రాజ్యాలకు కేంద్రంగా వర్ధిల్లింది. వాటిలో కొన్ని - [[:en:Samanid|సస్సానిద్‌లు]](875–999), [[:en:Ghaznavid Empire|ఘజనివిద్‌లు]] (977–1187), [[:en:Seljukids|సెల్జుకిద్‌లు]] (1037–1194), [[:en:Ghurids|ఘురిద్‌లు]] (1149–1212), [[:en:Timurid Dynasty|తైమూరిద్‌లు]] (1370–1506). వాటిలో ఘజని, తైమూర్ కాలాలు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ప్రముఖమైనవిగా పరిగణించబడుతున్నాయి<ref>[http://www.britannica.com/eb/article-9036676/Ghaznavid-Dynasty "Ghaznavid Dynasty"], ''Encyclopaedia Britannica'' Online Edition.</ref><ref>[http://www.britannica.com/eb/article-9072546/Timurid-Dynasty "Timurid Dynasty"], ''Encyclopaedia Britannica'' Online Edition.</ref>
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు