ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
image = [[File:Revenue divisions map of Nellore district.png|thumb|ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దివిజన్లు]]
 
== చరిత్ర ==
మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కొన్ని రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ([[ఆర్.డి.వో.]] లేదా [[సబ్ కలెక్టర్]] ) పాలనలో ఉంటాయి. ఒక్కో డివిజన్ లో కొన్ని [[మండలాలు]] ఉంటాయి. మండలాల్లో [[తహసీల్దారులు]] (పూర్వం [[ఎం.ఆర్.ఓ,]] ) ఉంటారు.[[భూమి శిస్తు]] వసూలు, [[జమాబందీ]], [[చౌకడిపో]] డీలర్ల నియామకం, శాంతి భద్రతలు,[[భూసేకరణ]] , రెవిన్యూ కోర్టుల నిర్వహణ, [[పంచాయతీ]] ల పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు,[[పంచనామా]] లు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు [[రెవిన్యూ డివిజినల్ అధికారులు]] కలెక్టర్ తరుపున తహసీల్దారుల లాగానే హాజరవుతూ ఉంటారు. ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులు ఈ అధికారే సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు. 1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 11 లక్షల మంది కి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.ఓ. పరిధిలో ఉంటున్నారు. ఐ.ఏ.ఎస్. అధికారుల్ని ముందు రెవిన్యూ డివిజినల్ అధికారులుగానే నియమిస్తారు. అప్పుడు వాళ్ళను సబ్ కలెక్టర్ అంటారు. ప్రతి జిల్లాలో సబ్ కలెక్టర్ కోసం ఒక రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఏ.పి.పి.యస్.సి. ద్వారా గ్రూప్1 పరీక్షలు పాసై వచ్చే డిప్యూటీ కలెక్టర్లను రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. తహసీల్దారులకు కూడా ప్రమోషన్ ఇచ్చి రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. పూర్వంబ్రిటీష్ పాలకులు భూమిశిస్తు వసూళ్లకోసం నియమించుకున్నవారే కలెక్టర్లు. ఇప్పుడు భూమిశిస్తు వసూళ్ల ప్రాధాన్యత తగ్గిపోయి సంక్షేమ కార్యక్రమాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్లు జిల్లాల ప్రగతి రధ సారధులయ్యారు. కలెక్టర్ల సహాయకులే ఈ సబ్ కలెక్టర్లు, [[డిప్యూటీ కలెక్టర్లు]], ఆర్.డీ.ఓలు.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి.హైదరాబాద్ చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు.అలా కాకుండా ప్రతి శాసన సభ్యులు నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు శాసన సభ్యులుకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.శాసన సభ్యులులకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి.ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గం రెండు మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకాకుండా ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా, మరీజనాభా ఎక్కువైతే కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేలా పునర్వ్యవస్తీకరించటానికి ప్రభుత్వం ల్యాండ్ రెవిన్యూ కమీషనర్ అధ్యక్షతన కమిటీని నియమించింది.(వార్త 28.7.2008).