మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
===శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం===
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
#శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది.లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్థుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్థులను పూర్తిచేసుకుంది.
#శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. [1]
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు