ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాతృడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది.
==భక్తితోనే ముక్తి==[[File:Vishnu.jpg|thumbవిష్ణు]]
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.
 
పంక్తి 35:
 
ముక్తి నాలుగు విధాలు. ఒకటి సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం, రెండు సామీప్యం - భగవంతుడి సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం, మూడు సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం, నాలుగు సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.
 
==మరికొన్ని సూత్రాలు==
శ్రీమన్ మధ్వమతే హరి: పరతర: సత్యం జగతత్వతో
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు