వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

విస్తర
పంక్తి 45:
రెండవ మాసూరు యుధ్ధం 1780లో [[హైదర్ అలీ]] [[ఆర్కాటు]] ను ముట్టడించడం అతని కుమారుడు [[టిప్పుసుల్తాన్]] పోలిలూరు (పెరంబాగం)లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ [[విలియం బైలీ]] (William Baillie) ని యుద్ధములో ఓడించి [[శ్రీరంగపట్టణం]] లో బందీగానుంచటం. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణం లో బందిగానుంచాడు. ఆయుద్ధమువలన బ్రిటిష్ వారి కి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు. పోర్టోనోవో (పరంగిపెట్టై) లో 1782 జరిగిన ఆ యుద్దము లో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు. టిప్పుసుల్తాను తన తండ్రితదనంతరం బ్రిటిష్ కంపెనీ వారితో వైరం ఇంకా కొనసాగించగా అప్పటి బ్రిటిష గవర్నర్ జనరల్ [[ కారన్ వాలీసు]] మూడవ మైసూరు యుద్దము లో స్వయంగా సైన్యాధిపత్యము వహించాడు.
 
====మొదటి మహారాష్ట్రయుధ్దము (1775-1782)====
భారతదేశములో బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములో చేసిన ఏడేండ్ల పాటు (1775-1872) జరిగిన మొదటి యుధ్దము వారన్ హేస్టింగ్సు కార్యకాలములోనే జరిగింది. అప్పటిదాకా కంపెనీ వారు సరాసరి మహారాష్ట్ర రాజ్య పరిపాలకుతో యుద్దమునకు తిగలేదు. 1775లో పూనా రాజధానిగా చేసుకుని దక్షతతో పరిపాలించుచున్న పీష్వా మాధవరావు క్షయవ్యాధితో మరణించుచూ 16 ఏండ్ల బాలుడైన తనతమ్ముడు నారాయణరావుకు తనతరువాత పట్టాబిషేకముచేయమని మంత్రిపరిషత్తుకు చెప్పి మరణించాడు. నారాయణరావును పీష్వాగా చేసినతరువాత మాధవరావు గారి పినతండ్రైన రఘునాధరావు కుట్రలు పన్ని నారాయణరావును చంపి తానే పీష్వాగా పరిపాలనచేపట్టాడు కానీ మంత్రి పరిషత్తులోని కొందమంది నానాఫడ్నవీసు సారధ్యములోని వారు అతనిని పదవినుండి తొలగమని అప్పుడే పుట్టిన నారాయణరావు కుమారుడు సవాయి మాధవరావు అను పసికందుకు పట్టముకట్టారు. అంతట రఘునాదరావు బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ బొంబాయి గవర్నరు ను ఆశ్రయించి తనకు సైనికి సహాయంచేయమని, దానికి ప్రతిఫలముగా తను మహారాష్ట్ర రాజ్యములోని కొన్ని భూభాగములను (సల్సెట్టీ, బస్సీను) ఇవ్వటమేకాక సూరత్ లోను, బరూచ్ లోను రాజస్వ హక్కు కూడా ఇచ్చేటట్లుగా సూరత్ లో 1775 మార్చిలో సంధిపత్రము వ్రాసి వప్పందం కుదుర్చుకున్నాడు.అదే సూరత్ సంధి. అ సంధి ప్రకారము లభించిన బ్రిటిష్ వారి సైన్యసహాయంతో సూరత్ నుండి పూనాపై దండయాత్రకు బయలుదేరగా దారిలో నానాఫడ్నవీసు పక్షమువారిచే పరాజయము పొందాడు. అంతేగాక కలకత్తాలోని బ్రిటిష గవర్నరు జనరల్ కౌన్సిల్ వారు ఆ సూరత్ సందిని రద్దు పరచుటకు పూనా కు రాయబారముపంపి నానాఫడ్నవీసు తో మార్చి1776 లోపురంధరు అను ప ట్టణంలో ఇంకో సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం కూడా సూరత్ లోను బరూచ్ లోను రాజస్వహక్కు తమకుండేటటుల. కానీ నానాఫడ్నవీసు పురంధర్ సందికి వ్యతిరేకముగా తన రాజ్యములోని పడమర సముద్రపుతీరమున ప్రెంచివారి కి నౌకాయానమునకు ఓడరేవునిచ్చాడు. దాంతో బొంబాయ గవర్నరు రఘునాధరావునే మహారాష్ట్ర రాజ్యసింహాసనాధిపతిచేయుటకు సైన్యమును పూనాకు పంపి నానాఫడ్నవీసుతో యుధ్దమునకు దిగారు. కానీ దారిలోనే వడగాం అను పట్టణం లో నానా ఫడ్నవీసు సైన్యముతో ఓడిపోయి సంధిచేసుకున్నారు అదే వడగాం సంది 1779 లో జరిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు పెద్దపెట్టున సైన్యమును పంపి కర్నల్ థామస్ డబ్ల్యూ గద్దర్ సారధ్యములో పెద్దపెట్టున యుద్దమునకు పంపి పూనాను ముట్టడించి పరిస్తితిని పూర్తిగా బ్రిటిష్ వారి వశంచేసుకుంటానికి పంపించాడు. అంతట గద్దార్డు సైన్యము అహ్మదాబాదును, బస్సీను ను ఆక్రమించి పూనా ముట్టడిచేశారు. ఈ లోపల మరో వైపు మాళ్వాలోబ్రటిష్ సైన్యాధికారి కమక్ ను మహారాష్ట్రకూటమిలోని గ్వాలియారు రాజా మహద్జీ సింధియా రాజు తో తలపడి యుద్దము లో ఓడిపోయేస్తితిలో ఇంకా బ్రిటిషసైనిక దళములు కర్నల్ ముర్రె ఆధిపత్యములో వచ్చి చేసిన యుధ్దములో చివరకు 1782 మే నెల లో గ్వాలియర్ రాజు సింధియా ను ఓడించి సల్బీ సంది వడంబడిక చేసుకుని బ్రిటిష కంపెనీ వారి ఆధిక్యత మహారాష్ట్రలో స్ధాపిచటంతో మొదటి యుద్దము ముగిసినది
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
=== గవర్నరుకాకమునుపు,1772కు ముందు కార్యాకాలం===
వంగరాష్ట్రములో మొదటివిడతలో 1750-1757, 1757- 1764 కార్యకాలం లోనూ తదుపరి 1768 దేవీకోట చేన్నపట్నంలో కంపెనీ పాలక సంఘములో సాధారణ సభ్యునిగా 1772 దాకా కార్యకాలంలోనూ వారన్ హేస్టింగ్సు చర్యలు, అభిమతాలు భారతదేశ ప్రజల క్షేమంకోరినవిగనూ బ్రిటిష్ వారి రాజ్యతంత్రములు న్యాయ-ధర్మ విరుద్ధములైనవిగనూ, బ్రిటిష్ ఉద్యోగుల ఆర్ధిక అవినీతి చర్యలు ఖండించునవిగనూ,బ్రిటిషదొరలకు అభ్యంతరములై తంటాలు కలిగించేవిగనూ విశదమగుచున్నవి.
 
===1773 లో విలియం కోటకు గవర్నరు అయన తరువాతతరువాతనుంచి===
ప్రజలక్షేమం, రాష్ట్రాభివృధ్దికి భాద్యతలు వహించకుండా పరిపాలనాధికారం వహించి, బ్రిటిష్ వారి ఖజానాలకు ధనం చేర్చటం ముఖ్య ఉద్దేశ్యంతో వారన్ హేస్టింగ్సుగవర్నరుగాను, గవర్నరు జనరల్ గా చేసిన కార్యాచరణలన్నీ కేవలం బ్రిటిష్ కంపెనీ, బ్రిటన్ దేశంకోసం చేసినవే. వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణల వల్ల వంగరాష్ట్రములోని పంచాయితీ విధానం నశించిపోయినది. సిస్తు వసూలుకు తాను పెట్టిన దివానుల పద్దతితో భూమిదున్ను రైతుల ఆర్ధిక పరిస్తితి దయానీయకమైనది. వంగ రాష్ట్రములో వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయాల వల్ల వంగరాష్ట్ర నవాబే కాక మొగల్ చక్రవర్తిని కూడా ఆర్ధిక దుస్తితికా పాలుచేశాడు. అయోధ్యనవాబును చేతుల్లో నుంచుకుని కాశీ పరిపాలించుచున్న రాజు చైత్ సింగును తవ వశం చేసుకునుట వారిద్దరి మద్దతుతో అయోద్య రాణుల వ్యగ్తిగత సంపత్తి దాదాపు 12 లక్షల నవరసులులు దాక వసూలుచేశే వరకు చేసిన రాజకీయకార్యాచరణ చాల విచారమైనవి. తనపై అవినీతి, లంచగొండితనమును ఆరోపణచేసిన నందకుమారుడనునతని పై ప్రత్యారోపణలు మోపి ఉరితీయించటం చరిత్రలోకెక్కిన అక్రమబద్ధమైన కార్యాాచరణ. వారన్ హేస్టింగ్సు చేసిన అటువంటి ఆర్దిక, రాజకీయ అక్రమ కార్యాచరణలను ఇంగ్లండు కామన్సు సభ్యుడైన బర్కు దొర (Edmund Burk) సభలో చేసిన మహోపన్యాసమునందు వర్ణంచబడినవి. రోహిల్ఖండు యుద్ధము, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా కు సహాయముచేయటంలో అంతర్గత రాజ్యతంత్రము బ్రిటిష్ వారి రింగ్ ఫెన్సు(Ring Fence) సూత్ర ప్రయోగం. ఆ రోహిల్ఖండు యుద్ధంతో ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా బ్రిటిష్ వారి చెప్పుచేతులలోకి వచ్చేటట్లు చేసుకున్న రాజ్యతంత్రము వారన్ హేస్టింగ్సు దొర ఘనత. బ్రిటిష్ వారికి మరాఠీలతో సరాసరి యుధ్దముచేయ వలసిన ప్రమాదములనివారించు రక్షణకవచములాంటి(buffer region) మద్యలోనొక రాజ్యంమునుంచటం ఒక రాజ్య తంత్రము. భూటాన్ రాజు ను ఓడించినతరువాత ఇక తదుపరి రాజ్యతంత్రము భూటాన్ టిబెట్టు లో కూడా బ్రిటిష్ వారి ఆధిక్యత వ్యాపించిటం వారన్ హేస్టింగ్సు చేసిన మరోరాజకీయకార్యక్రమం. వ్యగ్తిగతముగా కూడా వారన్ హేస్టింగ్సు తన అధికారము దుర్వినియోగపరచినట్లు చరిత్రలో కనబడుచున్నది. తన బంధువుడైనవానికొకనిని హైదరాబాదు నిజాంగారి పరిపాలనలో ఆర్ధకలాబముకలిగించే వ్యవహారమింకొకటి. ఇత్యాది కార్యాచరణలు వారన్ హేస్టింగ్సును రాజ్యధర్మముపాటించని పరిపాలకునిగనూ అవినీతి ఆర్దక లభ్దిదారుడైన వ్యక్తిగాను తీవ్ర ఆరోపణలకు గురిచేసియున్నవి. 1775లో మహారాష్ట్ర రాజ్యమును పరిపాలించు పీష్వా పదవికి వారసు లైన రెండు పక్షముల వైపూ బ్రిటిష్ కంపెనీ వారే సందులు చేయగా( మొదటగా ఒకవైపు బొంబాయి గవర్నర్ చేయగా దానిని రద్దు చేయుచూ రెండో పక్షమువైపు కలకత్తాగవర్నర జనరల్ గానున్న వారన్ హేస్టింగ్సుఇంకో సంధి చేశాడు ) ఆ పరిస్తితులలో లండన్ లోని కంపెనీ ప్రభువులు బొంబాయి గవర్నరు చేసిన సంధిని సమర్ధించుతూ చేసిన ఫైసలాను కూడా వినక గవర్నర్ జనరల్ గా అలాంటి సంధిచేయుటకు తనకే హక్కున్నదన్న పట్టుదలతో మహారాష్ట్ర రాజ్యములో చేసిన ది మొదటి మహారాష్ట్రయుద్దము (1775-1782) .
 
===1773 తరువాత గవర్నర్ జనరల్ గా===
గవర్నర జనరల్ కాక ముందు బ్రిటిషకంపెనీ వారి ఏ అభిమతములనైతే విమర్శించాడో గవర్నరు జనరల్ అయినతరువా తనేఆయా ఆభిమతములను అవలంబించి స్వదేశ రాజులు ఆంతరంగిక వ్యవహారములలో జోక్యముచేసుకుని రాజ్యతంత్రములను ప్రయోగించాడు. 1775లో మహారాష్ట్ర రాజ్యమును పరిపాలించు పీష్వా పదవికి వారసు లైన రెండు పక్షముల వైపూ బ్రిటిష్ కంపెనీ వారే సందులు చేయగా( మొదటగా ఒకవైపు బొంబాయి గవర్నర్ చేయగా దానిని రద్దు చేయుచూ రెండో పక్షమువైపు కలకత్తాగవర్నర జనరల్ గానున్న వారన్ హేస్టింగ్సుఇంకో సంధి చేశాడు ) ఆ పరిస్తితులలో లండన్ లోని కంపెనీ ప్రభువులు బొంబాయి గవర్నరు చేసిన సంధిని సమర్ధించి నచ్చచెప్పినా కూడా వినక గవర్నర్ జనరల్ గా అలాంటి సంధిచేయుటకు తనకే హక్కున్నదన్న పట్టుదలతో మహారాష్ట్ర రాజ్యములో చేసిన ది మొదటి మహారాష్ట్రయుద్దము (1775-1782) .
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు