వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
====మొదటి మహారాష్ట్రయుధ్దము (1775-1782)====
బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములో ఏడేండ్ల పాటు (1775-1872) చేసిన మొదటి యుధ్దము వారన్ హేస్టింగ్సు కార్యకాలములోనే జరిగింది. అప్పటిదాకా కంపెనీ వారు సరాసరి మహారాష్ట్ర రాజ్య పరిపాలకులతో యుద్దమునకు తిగలేదు. శివాజీ మహారాజు స్థాపించిన మహారాష్ట్రరాజ్యము భౌగోళికముగా ఇప్పటి మహారాష్ట్ర రాష్ట్రమే గాక, కెొంకణ ప్రాంతములోను, దక్కను పరగణాలలోనుజ్యముపరగణాలలోను, ఇప్పటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఇందోరు మొదలగు మాల్వా ప్రాంతములు లో విస్తరించిన యున్న సామ్రాజ్యము. మహారాష్ట్ర రాజ్యమును స్తాపించిన శివాజీ మహారాజు తరంవారు 1714 నుండీ బలహీనులైన కారణంగా ఆ రాజ్య మంత్రిపరిషత్తునందలి పీష్వా అను ప్రధాన మంత్రులే వారసత్వంతో పరిపాలించు చుండిరి. వీరి కాలములో రాజధానిని [[రాయఘడ్]] నుండి పూనాకు[[పూనా]] కు మార్చబడినది. అట్టి పీష్వాల తరంవారిలో నాల్గవ పీష్వా మాధవరావు (1761-1772) క్షయవ్యాధితో 1772 లో మరణించుచూ 16 ఏండ్ల బాలుడైన తనతమ్ముడు నారాయణరావుకు తనతరువాత పట్టాబిషేకముచేయమని మంత్రిపరిషత్తుకు చెప్పి మరణించాడు. నారాయణరావును పీష్వాగా చేసినతరువాత మాధవరావు గారి పినతండ్రైన [[రఘునాధరావు]] కుట్రలు పన్ని నారాయణరావును చంపి తానే పీష్వాగా పరిపాలనచేపట్టాడు కానీ మంత్రి పరిషత్తులోని కొందమంది [[నానాఫడ్నవీసు]] సారధ్యములోని వారు అతనిని పదవినుండి తొలగమని అప్పుడే పుట్టిన నారాయణరావు కుమారుడు [[సవాయి మాధవరావు]] అను పసికందుకు పట్టముకట్టారు. అంతట రఘునాదరావు బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ బొంబాయి గవర్నరు ను ఆశ్రయించి తనకు సైనికి సహాయంచేయమని, దానికి ప్రతిఫలముగా తను మహారాష్ట్ర రాజ్యములోని కొన్ని భూభాగములను ( [[సల్సెట్టీ]], [[బస్సీను]] ) ఇవ్వటమేకాక [[సూరత్]] లోను, [[బరూచ్]] లోను రాజస్వ హక్కు కూడా ఇచ్చేటట్లుగా సూరత్ లో 1775 మార్చిలో సంధిపత్రము వ్రాసి వప్పందం కుదుర్చుకున్నాడు. అదే సూరత్ సంధి. అ సంధి ప్రకారము లభించిన బ్రిటిష్ వారి సైన్యసహాయంతో సూరత్ నుండి పూనాపై దండయాత్రకు బయలుదేరగా దారిలో నానాఫడ్నవీసు పక్షమువారిచే పరాజయము పొందాడు. అంతేగాక కలకత్తాలోని బ్రిటిష గవర్నరు జనరల్ కౌన్సిల్ వారు ఆ సూరత్ సందిని రద్దు పరచుటకు పూనా కు రాయబారముపంపి నానాఫడ్నవీసు తో మార్చి1776 లో [[పురంధర్]] అను ప ట్టణంలో ఇంకో సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం కూడా సూరత్ లోను బరూచ్ లోను రాజస్వహక్కు తమకుండేటటుల. కానీ నానాఫడ్నవీసు పురంధర్ సందికి వ్యతిరేకముగా తన రాజ్యములోని పడమర సముద్రపుతీరమున ప్రెంచివారి కి నౌకాయానమునకు ఓడరేవునిచ్చాడు. దాంతో రఘునాధరావునే మహారాష్ట్ర రాజ్యసింహాసనాధిపతిచేయుటకు బొంబాయ కంపెనీ గవర్నరు సైన్యమును పూనాకు పంపి నానాఫడ్నవీసుతో యుధ్దమునకు దిగారు. కానీ దారిలోనే [[వడగాం]] అను పట్టణం లో నానా ఫడ్నవీసు సైన్యముతో ఓడిపోయి సంధిచేసుకున్నారు అదే వడగాం సంది 1779 లో జరిగి నసంది. అప్పుడు వారన్ హేస్టింగ్సు పెద్దపెట్టున సైన్యమును కర్నల్ థామస్ డబ్ల్యూ గద్దర్ సారధ్యములో యుద్దమునకు పంపి పూనాను ముట్టడించి పరిస్తితిని పూర్తిగా బ్రిటిష్ వారి వశంచేసుకుంటానికి పంపించాడు. అంతట గద్దార్డు సైన్యము [[అహ్మదాబాదు]] ను, [[బస్సీను]] ను ఆక్రమించి పూనా ముట్టడిచేశారు. ఈ లోపల మరో వైపు [[మాళ్వా]] లో బ్రిటిష్ సైన్యాధికారి కమక్ ను మహారాష్ట్రకూటమిలోని [[ గ్వాలియార్]] రాజా [[మహద్జీ సింధియా]] రాజు తో తలపడి యుద్దము లో ఓడిపోయేస్తితిలో ఇంకా బ్రిటిషసైనిక దళములు కర్నల్ ముర్రె ఆధిపత్యములో వచ్చి చేసిన యుధ్దములో చివరకు 1782 మే నెల లో గ్వాలియర్ రాజు సింధియా ను ఓడించి [[సల్బీ]] సంది వడంబడిక చేసుకుని బ్రిటిష కంపెనీ వారి ఆధిక్యత మహారాష్ట్రలో స్ధాపిచటంతో మొదటి యుద్దము ముగిసినది
 
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు