ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 98:
క్రీస్తు శకం 8 నుండి 12 మధ్య చంద్రవంశపు [[క్షత్రియులు]] ధరణికోటను రాజధానిగా చేసుకుని గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలను పాలించారు. హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని కోట సామ్రాజ్యం లేదా ధరణికోట సామ్రాజ్యం అని అందురు. కోట రాజులు జైన మతాన్ని అనుసరించినా తరువాత కాలంలో చాళుక్యుల వలె హిందూతత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో బ్రాహ్మణులకు అత్యంత విలువ ఉండేది. వీరికి భూములను, నగదును, గోవులను దానంగా ఇచ్చేవారు. కొందరు చరిత్ర కారులు కోట రాజులు మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు యొక్క వంశస్థులని చెబుతున్నారు. అయితే ఈ ధనుంజయుడి గురించి వివరాలు చరిత్రకు అందలేదు. కోట రాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాత కాలంలో కాకతీయులకు సామంత రాజులైయ్యారు. కోట వంశ రాజులకు తూర్పు చాళుక్యులతోను, కాకతీయులతోను, పరిచ్చేదులతోను, ఛాగి, కలచురిలతోను వైవాహిక సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడి కుమార్తె అయిన గణపాంబను వివాహమాడాడు. 1268 లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది. కోటవంశ రాజులు నేడు కోస్తా జిల్లాలలో కనిపించే ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకులకు పూర్వీకులు.
== సీ ఆర్ డీ ఏ ==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. <ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
పంక్తి 116:
==వ్యవసాయం, నీటి వనరులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ కె.చంద్రశేఖర్:- జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవం, రాష్ట్రపతి భవనంలో, 2015,మార్చ్-7వ తేదీ శనివారం నాడు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది ఆవిష్కర్తలతోపాటు, పలు రంగాలకు చెందిన వారికి, రాష్ట్రపతి [[శ్రీ ప్రణబ్ ముఖర్జీ]], ఎన్.ఐ.ఎఫ్.ఛైర్మన్ శ్రీ మషేల్కర్ పురస్కారాలు అందజేసినారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో, [[ధరణికోట]] గ్రామానికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్, [[రాష్ట్రపతి]] చేతుల మీదుగా, జాతీయస్థాయి తృతీయ పురస్కారం అందుకున్నారు. వీరు మూడు నిమిషాలలో 50 ఇటుకలు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనారు. [5]
 
==గణాంకాలు==
పంక్తి 148:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు