బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 17:
 
== బాల్యం ==
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని [[రత్నగిరి]]లో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, మంచి ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి [[గణితశాస్త్రం]]లో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజంగా అబ్బాయిసహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
 
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి [[పుణె]]కు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. [[1877]]లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.
"https://te.wikipedia.org/wiki/బాలగంగాధర_తిలక్" నుండి వెలికితీశారు