జి. సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
'ట్రిప్లికేన్ సిక్స్' (ఆరుగురు ట్రిప్లికేన్ యువకులు) అని పేరొందిన ఈ సముదాయం ఇతర విద్యార్థులకు బార్ లో సభ్యత్వం వచ్చాకా విడిపోయింది.  చివరకు వారిలో వార్తాపత్రికలో సంపాదకుడు జి. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచార్యర్ లు మాత్రమే మిగిలారు.
 
''ది హిందూ'' ప్రారంభం నుంచి తన ఉనికిని విశిష్టంగా నిలుపుకుంటూ వచ్చింది. సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో [[బాలగంగాధర తిలక్]] ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించిన జైలు పాలు చేసినప్పుడు ది హిందూ అరెస్టును తీవ్రంగా ఖండించింది. 3 డిసెంబర్ 1883లో పత్రిక 100 [[మౌంట్ రోడ్డుకురోడ్డు]]కు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
 
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ [[కాంగ్రెస్]] ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
 
1889 మే నెలలో సుబ్రహ్మణ్య అయ్యర్ ను [[బ్రిటీష్]] జాతీయుడైన బారిస్టర్ యార్డ్లీ నార్టన్ ఓల్లా పోడ్రిడా పత్రికలో కాలమ్ రాయమని ఆహ్వానించారు. క్రమంగా వారిద్దరూ మంచి సన్నిహితులయ్యారు.
 
సుబ్రహ్మణ్య అయ్యర్ సంప్రదాయవాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించుకున్నారు. ఏదేమైనా సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, ఈ కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడన్న పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.