అయిజ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 18:
[[2009]], [[ఏప్రిల్ 16]]న జరిగిన పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించుట వలన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. గ్రామంలో 17 పోలింగు బూత్‌లను ఏర్పాటుచేయగా పోలింగ్ బూత్‌లలో ప్రవేశించిన దుండగులు ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ధ్వంసంచేసి పోలింగ్ జరుగకుండా అడ్డుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 17-04-2009</ref> మళ్ళీ [[ఏప్రిల్ 18]]న 17 పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించగా కేవలం 9.65% మాత్రమే పోలింగ్ అయింది.<ref>ఈనాడు దినపత్రిక, మెయిన్ పేజీ, తేది 18-04-2009</ref> ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటన.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 19-04-2009</ref> రెండు పోలింగ్ కేంద్రాలలో ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. గ్రామంలోని మొత్తం 10961 ఓటర్లకుగాను 1059 ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలాన్ని గద్వాల నియోజకవర్గం నుండి విడదీసి ఆలంపూర్ నియోజకవర్గంలో కలపడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
== గ్రామ చారిత్రక పురుషులు ==
;వేంకటనరసింహాచార్యులు: అయిజ గ్రామానికిపట్టణానికి చెందిన వీరు గొప్ప విద్వాంసులు, పండితులు. వేదశాస్త్రపారంగతులు. [[ఉత్తనూర్]] గ్రామానికి చెందిన శ్రీగోపాలదాసు గారి శిష్యులు. మధ్వాచార్య కృత గ్రంథాలకు పాఠ ప్రవచనములు చేసిన వాడు. వీరి కుమారుడు వ్యాసతత్త్వజ్ఞులుగా పేరుగాంచిన వేంకటరామాచార్యులు<ref>గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-32</ref>.
;వ్యాసతత్త్వజ్ఞులు: వేంకటనరసింహాచార్యుల కుమారులైన వెంకటరామాచార్యులకు [[వ్యాసతత్త్వజ్ఞులు]] అని పేరు. వీరు ఆంధ్రభాషతో పాటు, కన్నడ భాషలోనూ తత్త్వబోధన చేసిన యోగిపుంగవులు. ఈ తత్త్వబోధసారాన్నే [[దాససాహిత్యం]] అన్నారు. వీరు తండ్రిగారి వలె గొప్ప విద్వాంసులు, పండితులు.
 
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు