పోకిమాన్ గో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
సాధార‌ణంగా ఏ స్మార్ట్‌ఫోన్ గేమ్ అయినా ఒకే ద‌గ్గ‌ర కూర్చుని ఆడుకునే విధంగా ఉంటుంది. అది టీవీ, కంప్యూట‌ర్ గేమ్ అయినా స‌రే. అన్నీ దాదాపుగా ఒకే ప్ర‌దేశానికి ప‌రిమిత‌మ‌వుతాయి. అయితే పోకిమాన్ గో గేమ్ మాత్రం అలా కాదు. ఈ గేమ్‌ను ఆడాలంటే క‌చ్చితంగా బ‌య‌ట‌కు వెళ్లాల్సిందే. బ‌య‌ట తిరుగుతూ గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో శ‌రీరానికి వ్యాయామం చేసిన‌ట్ట‌యి క్యాల‌రీలు కూడా ఖ‌ర్చ‌వుతాయి. ఈ గేమ్‌ను నిత్యం 45 నిమిషాల పాటు ఆడ‌డం వ‌ల్ల ఎవ‌రైనా వారానికి 1800 క్యాల‌రీల‌ను ఈజీగా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చ‌ట‌. దీంతో బ‌రువు కూడా త‌గ్గుతారు. అందుకే ఈ గేమ్ ఇప్పుడు అంద‌రినీ ఆకట్టుకుంటోంది.
== పోకిమాన్ ఆడటం ==
పోకిమాన్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న త‌రువాత ఫోన్‌లోని జీపీఎస్‌, ఇంటర్నెట్ క‌నెక్ష‌న్‌లను ఆన్‌లో ఉంచాలి. <ref name="gender"/><ref>{{cite web |last1 = Osworth |first1 = Ali |title = Pokémon Go Came Out In the US, Let’s Catch ‘Em All |url = http://www.autostraddle.com/pokemon-go-came-out-in-the-us-now-we-can-catch-em-all-344176/ |publisher = [[Autostraddle]] |accessdate = July 11, 2016 }}</ref> అనంత‌రం గేమ్‌ను స్టార్ట్ చేయాలి. దాంట్లో యూజ‌ర్ త‌న క్యార‌క్ట‌ర్‌ను ఎంచుకున్న త‌రువాత ఓ మ్యాప్ ద‌ర్శ‌న‌మిస్తుంది. అందులో యూజ‌ర్ ఉన్న ప్రాంతం వివ‌రాలు తెలుస్తాయి. అక్క‌డికి కొద్ది దూరంలో పోకిమాన్ భూతం ఉంటుంది. దాన్ని ప‌ట్టుకోవాలంటే మ్యాప్ స‌హాయంతో న‌డ‌క లేదా ప‌రుగు సాగించాలి. దాన్ని చేరుకోగానే గేమ్‌లో ఉండే బాల్‌తో దాన్ని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఇదంతా డివైస్‌లోనే జ‌రుగుతుంది. కాక‌పోతే యూజ‌ర్ మ్యాప్‌క‌నుగుణంగా ఆయా ప్ర‌దేశాల‌కు న‌డ‌క లేదా ర‌న్నింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.
 
[[దస్త్రం:Pokémon_Go_-_screenshot_of_map1.png|link=|268x268px]]
 
== ప్రాణాలపై తెస్తున్న పోకిమాన్ గేమ్  ==
పిల్లల నుంచి పెద్దల వరకు ఎవర్ని చూసిన ఈ గేమ్‌లో నిమగ్నమైపోతున్నారు. ఫోన్‌లో కనిపించే పోకిమాన్‌ని పట్టుకోవడమే ఈ ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడుతున్నప్పుడు తల పక్కకు తిప్పుకోలేం. ఇది యువతకు ఎంతలా నచ్చేసిందంటే తాజాగా ఓ యువకుడు ఈ గేమ్ ఆడుతుండగా ఓ ఆగంతకుడు అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. అయినా ఆ యువకుడు గేమ్‌లో నిమగ్నమైపోయాడు.
"https://te.wikipedia.org/wiki/పోకిమాన్_గో" నుండి వెలికితీశారు