వారసవాహిక: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (4) using AWB
పంక్తి 1:
'''వారసవాహిక''' అనేది ఇంగ్లీషులోని '[[క్రోమోజోమ్‌]]' ([[ఆంగ్లం]] chromosome) కి తెలుగు సేత. ఇంగ్లీషులో 'క్రోమోజోమ్‌' అన్న మాట గ్రీకు భాషలోని 'క్రోమో' (అంటే రంగు), 'సోమా' (అంటే శరీరం లేదా పదార్ధంపదార్థం) అన్న మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక క్రోమోజోమ్‌ అంటే 'రంగు పదార్ధంపదార్థం'. ఇది క్రోమోజోముల తత్వం అర్ధం కాని రోజులలో అజ్ఞానం వల్ల పెట్టిన పేరు. 'క్రోమోజోమ్‌' కి ఏ రంగూ ఉండదు. సూక్ష్మదర్శిని లో చూట్టానికి వీలుగా ఉంటుందని చాల పదార్ధాలకి రంగు పులుముతారు. ఈ పద్ధతిని ఇంగ్లీషులో staining అంటారు. జీవకణాలకి రంగు పులిమి [[సూక్ష్మదర్శిని]] లో చూసినప్పుడు ఆ రంగు [[కణిక|కణికలో]] (nucleus) ఉన్న జన్యు పదార్ధానికి అంటుకొని గాజు పలకకి ఉన్న పారదర్శకమయిన నేపధ్యంలో ఖణిగా కనిపిస్తుంది. అంతే తప్ప ఈ జన్యు పదార్ధానికి ఏ రంగూ లేదు. కనుక [[జీవకణం]]లో ఉన్న కణిక లో ఉన్న జన్యు పదార్ధంపదార్థం లో ఉన్న సన్నటి దారాల లాంటి పదార్ధాన్ని ''వారసవాహికలు'' అని తెలుగులో అందాం.
 
 
[[ఫైలు:Chromosome-upright.png|frame|క్రోమోసోము నిర్మాణం: (1) [[క్రోమాటిడ్]], (2) [[సెంట్రోమియర్]], (3) పొట్టి బాహువు, (4) పొడవు బాహువు.]]
 
== నిర్మాణ సరళి ==
మానవుని శరీరంలో ఉన్న ప్రతి జీవకణం లోనూ 23 జతల వారసవాహికలు ఉంటాయి. వీటిని వారసవాహిక-1,...వారసవాహిక-23, అని పిలవటం రివాజు. ఈ 23 జతలలోనూ ఉన్న జన్యు పదార్ధంపదార్థం (genetic matter) అంతటినీ కలిపి [[డి.ఎన్.ఎ.]] (DNA) అని కూడ వ్యవహరిస్తారు. కనుక స్థూలంగా మాట్లాడేటప్పుడు డి. ఎన్. ఏ. అన్నా, క్రోమోజోములు అన్నా, వారసవాహికలు అన్నా ఒక్కటే. కాని సూక్ష్మ దృష్టితో చూస్తే వారసవాహికలలో కొంత భాగం డి.ఎన్.ఎ., కొంత భాగం ప్రాణ్యం (protein) ఉన్నాయని వాదించ వచ్చు. కొన్ని వైరస్‌ లలో డి.ఎన్.ఎ. (లేదా ఆర్‌.ఎన్‌.ఎ.) తప్ప ప్రాణ్యం ఉండకపోవచ్చు.
 
 
సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇవి ఇంగ్లీషు అక్షరం X ఆకారంలో, బొమ్మలో చూపినట్లు కనిపిస్తాయి. ఇంకా బలవంతమైన సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇవి చుట్టలు చుట్టిన దారాలలాంటివనీ అర్ధం అవుతుంది. వీటి కట్టడిని బణుప్రమాణం (molecular scale) లోనూ, అణుప్రమాణం (atomic scale) లోనూ అర్ధం చేసుకొంటే జంటపెన (double helix) ఆకారంలో అమర్చబడ్డ నూక్లియోటయిడ్ (nucleotide)లనే 'పూసల' దండ అని అర్ధం అవుతుంది. ఇంత సూక్ష్మమైన కొలమానంలో వీటిని డి. ఎన్. ఏ. (DNA) అన్న పేరుతోనే ఎక్కువగా వ్యవహరిస్తారు. ఈ వారసవాహికలని పూసలతో గుచ్చిన దండలా ఊహించుకొంటే, ఆ దండలో అక్కడక్కడ ఉన్న కొన్ని పూసల గుంపులని జన్యువులు (genes) అంటారు. మావవుని జన్యుసంపద (genome) లో దరిదాపు 5000 జన్యువులు ఉంటాయని ఒక అంచనా ఉంది.
"https://te.wikipedia.org/wiki/వారసవాహిక" నుండి వెలికితీశారు