బొబ్బట్టు: కూర్పుల మధ్య తేడాలు

→‎తయారుచేయు విధానం: {{తెలుగింటి వంట}}
చి →‎తయారుచేయు విధానం: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 10:
*శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
*ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.
*ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్ధంపదార్థం బయటకు రాకుండా వత్తుకోవాలి.
*ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
*రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
*ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
 
 
ఈ బొబ్బట్టునే కర్నూల్ వైపు వారు, తక్కువ నూని వేసి, తీపి రొట్టెలలాగ చేస్తారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, నెయ్యి నూనెలు వాడకం తగ్గిస్తున్నారు కనుక ఈ విధంగా చేయడం కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు, వత్తడానికి పిండినే ఉపయేగిస్తారు. మామూలుగా చపాతీ వత్తినట్లే వత్తుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ (సన్నగా) ఉంటాయి. నూని, నెయ్యి ఎక్కువగా ఉండవు కనుక, వీనిని పాలల్లో కూడా వేసుకుని తింటారు. వీనిని తెలుగువారే కాక ఈ విధంగా మహారాష్ట వారు కూడా చేస్తారు.
Line 21 ⟶ 20:
 
{{wiktionary}}
 
[[వర్గం:పిండి వంటలు]]
"https://te.wikipedia.org/wiki/బొబ్బట్టు" నుండి వెలికితీశారు