వానపాము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
చి →‎భారతదేశపు వానపాము: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 36:
ఫెరిటిమా పోస్తుమా ఎక్కువగా తేమగల నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇవి కుళ్ళుతున్న జీవపదార్ధాలు, బంకమట్టి లేదా ఇసుక నేలల్లో ఉంటాయి. కాబట్టి ఆహారం దొరికే నేలపై పొరల్లోనే ఉంటాయి. వేసవికాలంలో నేల పొడిగా ఉండటం వల్ల లోతుగా బొరియలు చేసుకొని జీవిస్తుంది. వర్షం కురిసి బొరియలు నీటితో నిండినప్పుడు ఇవి బయటకు వస్తాయి. వీటి ఉనికిని అది నేలమీద విడుదలచేసే క్రిమి విసర్జనాల సహాయంతో గుర్తుపట్టవచ్చును. ఇవి నిశాచర జీవులు.
 
వీని దేహం స్థూపాకారంగా సుమారు 150 మి.మీ. పొడవు మరియు 3-5 మి.మీ. వ్యాసాన్ని కలిగివుంటుంది. ఉదరతలం కంటే పృష్ఠతలం [[ప్రార్ఫిరిన్]] (Porphyrin) అనే పదార్ధంపదార్థం ఉండటం వలన ముదురు రంగులో ఉంటుంది. ఇది వానపామును అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తుంది. వానపాము పూర్వాంతం మొనదేలి ఉండగా పరాంతం మొండిగా ఉంటుంది. పూర్వాంతంలో నోటి రంధ్రం ఉంటుంది. దేహమంతా వలయాకారపు ఖండితాలు 100 నుండి 120 వరకు ఉంటాయి. చివరి ఖండితంలో పాయువు ఉంటుంది. వానపాములో ప్రతి ఖండితం మధ్య కైటిన్ తో చేసిన శూకాలు ఖండితం చుట్టూ ఉంటాయి. ఈ రకమైన శూకాల అమరికను పెరికీటైన్ అమరిక అంటారు.
 
[[వలయ కండరాలు]] ఏకాంతర సంకోచ వ్యాకోచాలు జరుపుతూ వానపాము గమనాన్ని జరుపుతుంది. శూకాలు, శరీర కుహరద్రవం గమనంలో సహకరిస్తాయి. గమనం జరుపుతున్నపుడు విస్తరణ (Extention), లంగరు (Anchoring), సంకోచం (Contraction) అనే మూడు ప్రక్రియలు వానపాము దేహంలో జరుగుతాయి.
"https://te.wikipedia.org/wiki/వానపాము" నుండి వెలికితీశారు