షోడశ సంస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటిపోయింది
పంక్తి 1:
[[బొమ్మ:Hindu_Samskaras.jpg|thumb|right|హిందూ రిట్యువల్స్ చిత్రం]]
సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి ఒక్క హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. తల్లి గర్భములో ప్రవేశించిన సమయము మొదలు కొని, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక ఆత్మశాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.
 
సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).
వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:
==గర్భాదానం==
స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని(పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.
==పుంసవనం==
స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.
"https://te.wikipedia.org/wiki/షోడశ_సంస్కారాలు" నుండి వెలికితీశారు