దోర్భల ప్రభాకరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఇతడు [[1948]], [[అక్టోబర్ 8]]వ తేదీకి సరియైన [[సర్వధారి]] నామ సంవత్సర, [[ఆశ్వయుజ శుద్ధ షష్ఠి|ఆశ్వయుజ శుక్ల షష్ఠి]] నాడు [[మెదక్ జిల్లా]], [[రామాయంపేట]]లో అనంతలక్ష్మి, రత్నయ్య దీక్షితులు దంపతులకు జన్మించాడు. బాల్యంలో తండ్రి వద్ద విద్యనభ్యసించి ప్రాథమిక, మాధ్యమిక సంస్కృత విద్యను నిజామాబాద్ జిల్లా లోని ఇందూరు రఘునాథ సంస్కృత పాఠశాలలో చదివాడు. ఇక్కడ తన సోదరుడైన [[దోర్భల విశ్వనాథశర్మ]] వద్ద విద్యాభ్యాసం చేశాడు. తరువాత హైదరాబాదులోని వేంకటేశ్వర వేదాంతవర్థినీ సంస్కృత కళాశాలలో చదివి బి.ఒ.ఎల్ పట్టా పొందాడు. అటుపిమ్మట వాల్తేరు లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1979లో ఎం.ఎ.ఉత్తీర్ణుడైనాడు. "న్యాయ వైశేషికయోః ఆత్మతత్త్వ సమీక్షణమ్‌" అనే సిద్ధాంత గ్రంథాన్ని పోచంచెర్ల శ్రీరామమూర్తి పర్యవేక్షణలో సమర్పించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టాను పొందాడు. శాస్త్రుల విఠలశాస్త్రి, కల్యాణ మహారాజు, కోవిల్ కందాడై శఠకోపాచార్యులు, వర్‌ఖేడ్‌కర్ కృష్ణాచార్యులు ఇతనికి సంస్కృతం నేర్పిన గురువులు. రొంపిచెర్ల శ్రీనివాసాచార్యులు, రావూరి వెంకటేశ్వర్లు వద్ద అవధాన విద్యను నేర్చుకున్నాడు.
===ఉద్యోగము===
ఇతడు 1967-68లో నల్లగొండలోని గీతావిజ్ఞాన ఆంధ్ర కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని వాడ్రేవు జోగాయమ్మ వేద సంస్కృత పాఠశాలలోను, పిమ్మట కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలోను ఉపన్యాసకుడిగా ప్రవేశించి 1995లో పదోన్నతి పొంది ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా 10 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ గావించాడు.
==రచనలు==
 
ఇతడు సుమారు 20 వరకు సంస్కృత నాటకాలు రచించాడు. వీటిలో కొన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. [[శ్రీశైలప్రభ]] మొదలైన పత్రికలలోను, సావినీరులలోను అనేక వ్యాసాలను ప్రకటించాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని:
# గురుభక్తి
# పార్వతీ కళ్యాణము
# సౌందర్యలహరి
# అగ్ని మీడే పురోహితమ్‌
# సంస్కృత కవితా మంజరి
# జాగృహిత్వం భారతీయ
==అవధానాలు==
==బిరుదులు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:సంస్కృత కవులు]]
[[వర్గం:అవధానులు]]
"https://te.wikipedia.org/wiki/దోర్భల_ప్రభాకరశర్మ" నుండి వెలికితీశారు