కత్రినా కైఫ్: కూర్పుల మధ్య తేడాలు

"Katrina Kaif" పేజీని అనువదించి సృష్టించారు
"Katrina Kaif" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో జన్మించిన కత్రినా, భారత్ కు రాకముందు ఎన్నో దేశాలు తిరిగారు వీరి కుటుంబం. ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు మొదటిసారి మోడలింగ్ చేశారు. ఆ తరువాత దానినే కెరీర్ గా మలచుకున్నారు కత్రినా. లండన్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో నిర్మాత కైజద్ గుస్తాద్ ఆమెకు తన సినిమా బూమ్(2003)లో నటించమని అడిగారు. ఆమె ఒప్పుకుని ఈ సినిమా చేశారు కానీ, ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ కావడమే కాక విమర్శాత్మకంగా కూడా విఫలమైంది. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమెకు మోడలింగ్ లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమెకు హిందీ రాకపోవడంతో సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. తరువాత ఆమె తెలుగులో మల్లిశ్వరి(2004) సినిమాలో నటించారు. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. బాలీవుడ్ లో తరువాత ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా?(2005), నమస్తే లండన్(2007) వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా, ఆమె నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి.
 
2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తరువాత అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ(2009), రాజ్నీతీ(2010), జిందగీ నా మిలేగీ దుబారా(2011) సినిమాల్లో నటించారామె. మేరే బ్రదర్ కీ దుల్హన్(2011) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు ఆమె. ఆ తరువాత ఆమె  నటించిన ఏక్ థా టైగర్(2012), ధూమ్3(2013) సినిమాలు అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆమె నటనకు ఎన్నో విమర్శలు వచ్చినా, ఆమె ఎన్నో కమర్షియల్ గా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ, టాప్ హీరోయిన్ గానే కొనసాగుతూ వచ్చారు.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/కత్రినా_కైఫ్" నుండి వెలికితీశారు