తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 12:
పత్రిక సంచికల మధ్య ఉండే వ్యవధిని అనుసరించి వర్గీకరిస్తే వాటిని ఇలా విభజిస్తారు:
==== దిన పత్రికలు ====
రోజుకు ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తా పత్రికలు దినపత్రికలుగా వెలువడుతూంటాయి. ప్రస్తుతం తెలుగు దినపత్రికలుగా [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]], [[సాక్షి]], [[వార్త]],[[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ]], [[విశాలాంధ్ర]], [[ప్రజాశక్తి]] వంటి పలు పత్రికలు పేరొందాయి. తెలుగు పత్రికల చరిత్రలో తొలుత [[ఆంధ్రపత్రిక]], [[కృష్ణా పత్రిక|కృష్ణాపత్రిక]],[నమస్తే తెలంగాణ]] వంటివి నడిచాయి. వీటిలో కృష్ణా పత్రిక మరల ప్రారంభమైంది. చాలావరకూ దినపత్రికలు ఉదయం వస్తూంటాయి. సాయంకాల సంచికలు వెలువరించే పత్రికలు మరికొన్ని ఉంటాయి.<br />
సమాచార వ్యవస్థ వేగంగా లేని రోజుల్లో ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం పాఠకుని చేతికి అందేవి. ఈ నేపథ్యంలో తెల్లవారేసరికల్లా పాఠకుని చేతికి అందడాన్ని సవాలుగా స్వీకరించిన పత్రికలు సర్క్యులేషన్లో ముందుకు వెళ్ళి ఇతర పత్రికల్ని వెనక్కి నెట్టాయి.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు