పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: బాద్యత → బాధ్యత (2), → (27), , → , (7), ప్రదమ → ప్రథమ using AWB
పంక్తి 2:
[[File:Wedding rings.jpg|thumb|right|వివాహ ఉంగరాల జత]]
{{హిందూ మతము}}
'''పెళ్ళి''' లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాద్యతలనుబాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.
==శబ్ద ఉత్పత్తి==
'''పెళ్ళి''' అనే పదానికి వెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నవి. పెళ్ళికి ఇంగ్లీషు భాషలో "'మ్యారేజ్"' అని అర్ధము. [[ఆంగ్లం|ఆంగ్లభాషలో]]"మ్యారేజి (Marriage) అని అంటారు. ఈ పదం [[:en:Middle English|మధ్య ఆంగ్ల]] పదమైన ''mariage'' నుండి ఉత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం ''marier''(పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు లాటిన్ పదమైన ''marītāre'' (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు ''marītāri'' అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన ''marīt-us -a, -um'' అనగా పెళ్ళీ సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో '''భర్త''' అనే పదం లేదా స్త్రీ రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."<ref name="OED_marriage">Oxford English Dictionary 11th Edition, "marriage"</ref> పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన ''matremoine'' పదం నుండి ఉద్భవించినది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం ''mātrimōnium''అనే లాటిన్ పదం నుండి జనించినది.<ref name="Etymology">{{cite web|url=http://www.etymonline.com/index.php?term=matrimony |title=Online Etymology Dictionary |publisher=Etymonline.com }}</ref>
 
==హిందూ వివాహం==
పంక్తి 16:
# వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది.
# వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ" అనే మానసిక వ్యాధికి గురి అయి ఉండరాదు.
# వధూ వరుల మధ్య నిషేధించబడిన స్థాయిలలో బంధుత్వం ఉండరాదు. అనగా ఒకరు వారి తల్లి నుంది మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు. అలాగే వధూవరులకు సపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పైస్థాయిలో ఉండరాదు. సోదర/సోదరి, పిన తండ్రి/మేనమామ , మేనకోడలు/కూతురు , మేనత్త/పినతల్లి/మేనల్లుడు/కుమారుడు, సోదరులు/సోదరీల సంతానముల మధ్య వివాహం నిషేదించబడినది. ఏ వ్యక్తి అయినా తన సోదరుడి భార్యను విడాకులైన తరువాత కూడా వివాహం ఆడరాదు. అయితే ఏ ప్రాంతములోనైనా, లేదా సామాజిక వర్గంలోనైనా అనాదిగా పాటిస్తూ వచ్చిన ఆచారం రీత్యా నిషిద్ధ స్థాయిలలో బంధుత్వం ఉన్నప్పటికీ వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య గతించిన వ్యక్తి, భర్త గతించిన మహిళను వివాహమాడవచ్చు.
 
కేవలం సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఒక దస్తావేజు రాసి నమోదు చేయించినంత మాత్రాన హిందూ వివాహం చెల్లుబాటు కాదు. వివాహానికి సంబంధించిన ఆచార క్రతువులు నిర్వర్తించనిదే ఆ వివాహం సక్రమమైనదిగా గుర్తించలేము. అదే విధంగా హిందూ వివాహాల రిజిష్టర్ లో అసలు వివాహం కార్యక్రమమే జరుపకుండా నమోదు చేసిన వివరాలు ఆ వివాహాన్ని చలామణి చేయవు. అయితే వివాహ కార్యక్రమం పూర్తి అయినాక హిందూ వివాహ రిజిష్టర్ లో వధూవరులు తమ వివాహ వివరాలను నమోదు చెయవచ్చు. ఈ రిజిష్టర్ లోని నమోదు చేయబడిన అంశాలు వివాహం వాస్తవంగా జరిగినట్లు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇలా నమోదు చేయడం దంపతులిద్దరికీ ఉపయోగకరం.
పంక్తి 26:
===హిందూ మత వివాహ విధానము===
#హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల [[జాతక సమ్మేళనము]] లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు మరియు 20 వింశతి (కూట) వర్గములు అనే [[వివాహ పొంతనములు]] చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.
# ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, అందుబాటు, అవసరార్ధం, అవకాశం, ఆర్ధిక స్థితిగతుల, ఆకాంక్ష అయినదనిపించుకునేందుకు, తదితరాల మేరకు సంబంధము కలుపుకొని నిశ్చయించు కుంటున్నారు. ప్రస్తుతము వివాహ సంబంధములు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలో ఎక్కువగా ఆ కుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.
# జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు [[చలం]].
===ఆడపిల్ల వారు మగపిల్ల వాడికి చేయవలసినవి===
పంక్తి 175:
{{వ్యాఖ్య|<big>మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!!</big> }}
 
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.
* తలంబ్రాలు : మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల [[అక్షతలు]] తల మీదుగా పోసుకొంటారు. దీనినే '''అక్షతారోహణం''' అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.
{{వ్యాఖ్య|<big>ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!!</big>}}
పంక్తి 182:
* సప్తపది, పాణిగ్రహణం :నాలుగు మంత్రాలతో వరుడు వధువు చేతిని తన చేతిలోకి తీసుకోవడం అగ్ని సమక్షంలో జరుగుతుంది. అంటే అగ్ని సాక్షిగా జరుగుతుంది. మంచి సంతానం కోసం, విధి విహితమైన కర్మలను నిర్వర్తించడం కోసం పాణిగ్రహణం చేస్తున్నానని వధువు అనడం ఈ మంత్రాల ఆంతర్యం. వరుడు తన కుడిహస్తాన్ని కింద ఉండే విధంగా వధువు హస్తం పైన ఉండే విధంగా పట్టుకుంటాడు. కేవలం స్త్రీ సంతానాన్ని మాత్రమే కోరుతుంటే వరుడు వధువు వేళ్లు మాత్రమే పట్టుకునేవాడు. ఇప్పుడు ఈ ఆచారాలను పాటించేవారు అరుదు.
* సన్నికల్లుతోయం :
పెళ్ళుకూతురు చేత "సన్నికల్లు" ఎందుకు తొక్కిస్తారు?సన్ని కల్లు పొత్రం ఒకటి లెకపొతే రెండోది పని చెయ్యదు, పెళ్ళికూతురి కాలికి మెట్టెలు అప్పుడే పెట్టిస్తారు వరుడి చెత, అలా పెట్టించి సప్తపది హోమం చుట్టు వెయించి ,వరుడు వధువు మెడలో నల్ల పూసలు కడతాడు,ఒకరికొకరు, సన్ని కల్లు పొత్రం లా కలిసి ఉందాలని దీని సంకేతం.రుబ్బురొలు పెద్దగా ఉంటుంది, ఇంకా శివ స్వరూపం , దాన్ని మోసుకు రావటం కష్టం కనుక సన్ని కల్లు మీద చెయించరు మనవాళ్ళు.
ఇది కూడా ఒక సాక్షం గా తీసుకుంటారు, అగ్నిని తీసుకున్నట్టు.
* రాజహోమం :
పంక్తి 188:
* నాగవల్లి
* సదస్యం
* నల్లపూసలు : మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.పెళ్లైందన్న గుర్తుతో పాటు అంగరంగ వైబోగంగా జరిగిన తమ వివాహం గురించి , తమ సంసారిక సుఖజీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుందని ఓ నమ్మకం.ప్రతి మాట చేష్ట చేష్ట తనదని స్రీ ఒప్పుకున్నందుకు నిదర్శనంగా చెబుతారు. ఏమైనా బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించటం వల్ల ఓ ప్రత్యేక అందం స్రీకి వస్తుందనటంలో సందేహం లేదు.
* అరుంధతీ నక్షత్రం
ముందు అరంధతీ నక్షత్రం (Alcor) కనిపించేది రాత్రి పూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం (Ursa Major) చివర వశిష్టుడి (Mizor) వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. దీవి వెనుక ఒక కథ ఉన్నది. అరుంధతీ దేవి మహా పతివ్రత .అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వెషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేక పోయింది. అందుకనే మహా పతివ్రత అయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వదూవరులకి సప్తపది అయిన తరువాత చూపించ పడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ఆవిడకి ఇచ్చిన వరము.
పంక్తి 207:
శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?
 
మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్నివేళలా వారిపై ఉంటుందని పురాణాలూ తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.
అగ్ని కూడా ఇక్కడే సాక్షి , పెళ్ళి మంటపంలో మంగళ సూత్రం కట్టే ప్పుడు అక్కడ అగ్ని పెట్టరు, పక్కన విడిగా పెడతారు.
 
పెళ్లిలో వరుడు వధువు నడుముకి ఒక తాడు కడతాడు... అదేంటి? ఎందుకు అలా కడతారు
పంక్తి 216:
అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం
 
ఆడపిల్ల పుట్టగానే ఆమె పోషణ బాధ్యత(సోమునిది)చంద్రునిది. కొన్ని సంవత్సరాలు ఆమె పోషణ చంద్రుడు స్వీకరించి ఆమెకు ఆకర్షనీయతను అందిస్తాడంట. తరువాత గంధర్వుడు పోషణ భాధ్యతబాధ్యత స్వీకరించి ఆమెకు లావణ్యాన్ని సమకూరుస్తాడట. ఆ తరువాత అగ్ని కొన్ని సంవత్సరాలు పోషించి కామగుణాన్ని పెంపొందిస్తాడంట. ఈ విధంగా పరిపక్వమయిన కన్యగా మారిన తరువాత ఆమెను "వరుడు" స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి అని విన్నాను. ఈ విధంగా చంద్రుడు సాక్షిగా గంధర్వుడు, గంధర్వుడు సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా "వరుడు" స్వీకరిస్తాడు కాబట్టి "అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం" అంటారు అని విన్నాను
పెళ్ళిలోవదువు వరుడు "తలంబ్రాలు" ఎందుకు పోసుకుంటారు
 
మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైనప్రథమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.
 
కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు వివాహం వల్ల భార్యా భర్తలు కలిసి మెలసి ఒకరికొకరు తోడుగా ఉండాలని సమాజం ఆశిస్తుంది. వివాహం నిలబడటానికి భార్యాభర్తలు ఒకరి నుండి మరికరు వేరు కారాదు. అయితే దంపతులలో ఎవరైనా సరైన కారణం లేకుండా మరికరిని వదిలి దూరమైతే బాధిత్ భర్త లేదా భార్య కోర్టుద్వారా తమ వైవాహిక సంబంధాల పునరుద్ధరణ కోసం దావా దాఖలు చేయవచ్చు. అయితే తప్పుచేసిన వ్యక్తి ఇలాంతి పరిహారం తీసుకోవడానికి వీలులేదు.
పంక్తి 231:
 
==హిందూ వివాహ పద్ధతులు==
ప్రధానముగా హిందూవులలో నాలుగు విధానలైన వివాహ పద్ధతులున్నాయి. అవి. 1. బ్రహ్మీ వివాహం, 2. గాంధర్వ వివాహం, 3. క్షాత్ర వివాహం. 4. రాక్షస వివాహం. [మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]
===బ్రహ్మీ వివాహం===
ఋషి సాంప్రదాయ బద్దమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహము. వధూ వరుల కుల పెద్దలు, తల్లి దండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైధిక విధితో ఆచార యుక్తముగా జరిపించిన వివాహము అని అంటారు. ఇది సనాతనమైనది సర్వ జన సమ్మతమైనది మరియు సత్సంప్రదాయము. [మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు. పుట 30]
పంక్తి 240:
==సప్తపది==
 
సఖాసప్తపదాభవ .... అనాఅ ఇద్దరు ఏడడుగులు కలసి నడిస్తే మిత్రత్వం కల్గుతుందని శాస్త్రం. వరుడు వధువు నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్ని హోత్రమునకు దక్షిణపైఅవున నిలబడి తూర్ప్7ఉ దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి ఏడడుగులు నడవాలి. కూక్క్క అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెపుతాడు పురోహితుడు.
1. మొదటి అడుగు: ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు ... ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక.
2. రెండవ అడుగు: 'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు ఈ రెండవ ఆదుగుతో మనిద్దరకు శక్తి లభించు నట్లు చేయు గాక.
3. మూడవ అడుగు: 'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు ఈ మూడవ అడుగు వివాహ వ్రత సిద్ధి కొరకు విష్ణువు అనుగ్రహించు ఘాక.
4. నాల్గవ అడుగు: చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు ఈ నాలగవ ఆదుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించు గాక.
5. ఐదవ అడుగు. పంచ పశుభ్యోవిష్ణు త్వా అన్వేతు ఈ ఐదవ ఆదుగు మనకు పశుసంపదను విష్ణువు కలిగించు గాక.
6. ఆరవ అడుగు. షృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమునిచ్చుగాక.
7. ఏడవ అడుగు... సప్తభ్యో హోతాభ్యో విష్ణుః ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహించు గాక.
[మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]
 
పంక్తి 258:
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటె 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడినది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశ్యం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
 
ముస్లిం, విగ్రహారాధన, అగ్ని ఆరాధన అవలంబించే వారిని వివాహం చేసుకోరాదు. అలాగే తన భర్య తరపు పైస్థాయి క్రింది స్థాయి వారసులను పూర్వీకులను లేదా వారి సంతానాన్ని వివాహం చేసుకోరాదు. పెంపుడు బిడ్డలను వివాహం చేసుకోవడం నిషిద్ధం. ఒక ముస్లిం స్త్రీకి రెండు సం.లు వయసులోపు గల బిడ్డ తల్లి పాలు పొందకలగడం వల్ల పెంపుడు బిడ్డగా చెప్పబడుతోంది. అయితే ఒక ముస్లిం వ్యక్తి తన తల్లి వద్ద పాలు త్రాగిన పెంపుడు సోదరిని పెళ్ళి చేసుకోవచ్చు. మత పవిత్ర గ్రంథం బహు భార్యత్వాన్ని నిషేధించినప్పటికీ కొన్ని మినహాయింపులు యివ్వబడ్డాయి.
పంక్తి 293:
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటె 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడినది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశ్యం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
 
ముస్లిం, విగ్రహారాధన, అగ్ని ఆరాధన అవలంబించే వారిని వివాహం చేసుకోరాదు. అలాగే తన భర్య తరపు పైస్థాయి క్రింది స్థాయి వారసులను పూర్వీకులను లేదా వారి సంతానాన్ని వివాహం చేసుకోరాదు. పెంపుడు బిడ్డలను వివాహం చేసుకోవడం నిషిద్ధం. ఒక ముస్లిం స్త్రీకి రెండు సం.లు వయసులోపు గల బిడ్డ తల్లి పాలు పొందకలగడం వల్ల పెంపుడు బిడ్డగా చెప్పబడుతోంది. అయితే ఒక ముస్లిం వ్యక్తి తన తల్లి వద్ద పాలు త్రాగిన పెంపుడు సోదరిని పెళ్ళి చేసుకోవచ్చు. మత పవిత్ర గ్రంథం బహు భార్యత్వాన్ని నిషేధించినప్పటికీ కొన్ని మినహాయింపులు యివ్వబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు