కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
 
చిన్నప్పట్నుంచీ పట్టుదల గల వ్యక్తిత్వం  తనదని వివరిస్తారు కంగనా. తన తండ్రి తమ్ముడికి ప్లాస్టిక్ గన్ తెచ్చి, తను ఆడుకోవడానికి మామూలు బొమ్మలు తెస్తే ఈ తేడా చూపొద్దనీ అబ్బాయిలు ఆడుకునేవాటితో తానూ ఆడుకుంటానని చెప్పవారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె.<ref name="htinterview"><cite class="citation news">Ahmed, Afsana (7 July 2013). </cite></ref> అందరు ఆడపిల్లలూ వేసుకునే బట్టలు కాక, తన కంటూ విలక్షణమైన ఫ్యాషన్ సృష్టించుకునేవారట కంగనా.<ref name="cosmo" /><ref name="htinterview" /> [[చండీగఢ్]] లోని డిఎవి పాఠశాలలో చదువుకున్నారు ఆమె. సైన్స్ బాగా ఇష్టంగా చదివేవారు. చదువులో ఎప్పుడు ముందు ఉండేవారట కూడా.<ref name="swan"><cite class="citation news">Thind Joy, Jagmita (23 April 2012). </cite></ref><ref><cite class="citation web">[http://movies.ndtv.com/bollywood/kangana-ranaut-enjoyed-the-anonymity-that-came-with-studying-abroad-492336 "Kangana Ranaut: Enjoyed the anonymity that came with studying abroad"]. </cite></ref> మొదట్లో తన తల్లిదండ్రుల పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు ఆమె.<ref name="doctor"><cite class="citation news">Nag, Nilanjana (1 June 2010). </cite></ref> అయితే 12వ క్లాస్ చదివేటప్పుడు ఒక యూనిట్ టెస్ట్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తన డాక్టర్ కలల్ని వదిలేసుకుని వైద్య విద్యకు ఎంట్రెన్స్ పరీక్ష అయిన అఖిలభారత వైద్య పరీక్షకు హాజరు కూడా కాలేదు కంగనా.<ref name="doctor" /> తన 16వ ఏట ఢిల్లీకి  నివాసం మార్చారు ఆమె.<ref name="think" /><ref name="soul"><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Kangana-Ranaut-bares-her-soul/articleshow/2497438.cms?referral=PM "Kangana Ranaut bares her soul"]. </cite></ref> వైద్య విద్య చదవనని ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్యం లేకుండా ఉంటే తనకు నచ్చదని ఆమెపై వత్తిడి తీసుకొచ్చేవారట ఆమె తండ్రి.<ref name="htinterview" />
 
ఢిల్లీ వెళ్ళాకా ఏం పనిచేద్దామా అని అనుకుంటూ ఉండగా, ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీ వారు తమకు మోడలింగ్ చేయమని ఆమెను అడిగారు.<ref name="biography" /><ref name="soul" /> దాంతో కొన్నిరోజులు మోడలింగ్ చేసిన ఆమె ఆ వృత్తిలో సృజనాత్మకత  లేదు అని భావించి మానేశారు కంగనా. అస్మితా థియేటర్ గ్రూప్ లో చేరి అరవింద్ గౌర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు కంగనా.<ref><cite class="citation news">Mahajan, Esha (18 June 2012). </cite></ref> గిరీష్ కర్నాడ్ రచించిన ప్రముఖ నాటకం తలెదండాలో కూడా నటించారు ఆమె. అరవింద్ గౌర్ దర్శకత్వంలో ఇండియా హబిటెట్ సెంటర్ లో జరిగిన వర్క్ షాప్ లో ఎన్నో నాటకాల్లో నటించారు కంగనా.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/report/slide-show-1-10-things-you-didnt-know-about-kangna-ranaut/20140307.htm#1 "10 things you didn't know about Kangna Ranaut"]. </cite></ref> ఒక నాటకం జరిగే సమయంలో సహ నటుడు రాకపోవడంతో కంగనా ఆమె పాత్ర, అతని పాత్రా కూడా నటించి అందరి మెప్పులూ పొందారు.<ref name="hearts"><cite class="citation news">Uniyal, Parmita (22 March 2014). </cite></ref> ప్రేక్షకుల స్పందన చూసి సినిమాల్లో నటించడానికి నిర్ణయించుకున్నారు ఆమె. దాంతో తన నివాసాన్ని [[ముంబై|ముంబైకి]] మార్చారు. అక్కడ ఆశాచంద్రా డ్రామా స్కూల్లో నాలుగు నెలల కోర్సులో చేరారు కంగనా.<ref><cite class="citation news">Sahani, Alaka (23 March 2014). </cite></ref>
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు