సప్తచక్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్ధితి → స్థితి (2) using AWB
పంక్తి 13:
</poem>
 
మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.
 
సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.
పంక్తి 32:
</poem>
 
నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. మూడు ముఖములు కలది. గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. నాలుగు చేతులు కలది. వజ్రం, శక్తి, దండము, అభయ ముద్రలు ధరించినది. డామరము ఆది దేవతలచే పరివేష్టించబడినది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లం తో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.
 
మణిపూరక చక్రం మంత్రం : ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”
 
మణిపూరకచక్రం :- ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు. 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.
 
బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.
ఈ చక్ర మానసిక స్వభావం - మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.
 
లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం? ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ...) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.
 
శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.
పంక్తి 54:
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం
</poem>
 
మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.
పంక్తి 68:
రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం
శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః
</poem>
 
ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు కలవు. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించినది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడినది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.
 
క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టoకహస్తా 12. ఠoకారిణి
పంక్తి 86:
</poem>
డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు ఆన్నీ “డ” కార సంభంధమైనవి. డాకినీ వర్ణము ఎఱుపు. ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు. జీవి పిండ దశలో ‘శుక్త + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఈ పిండ స్ధితిస్థితి డాకినీ స్ధితిస్థితి. ఈమె త్రిలోచన – భూత, భవిష్యత్, వర్తమానాలు చూడగలది. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములుగా గల దేవత. బీజాక్షరములు = ఖ, ఛ, ఠ, ధ, ఫ -- ఘ, ఝ, ఢ, ధ, భ.
 
హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము)
521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.
 
<poem>
పంక్తి 96:
షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,
హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః
</poem>
 
ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.
పంక్తి 104:
 
హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము)<br />
521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.
 
<poem>
పంక్తి 111:
షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,
హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః
</poem>
 
ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.
పంక్తి 118:
బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.
 
యాకిన్యoబస్వరూపిణి:- (534) (6 నామములు) (7 వ చక్రము)<br />528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. (సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)
 
<poem>
పంక్తి 125:
ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం
సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః
</poem>
 
శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది. యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది. ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.
పంక్తి 137:
;సహస్రారచక్రం : -
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ
 
ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.
 
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు.
ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు.
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.
 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం.
"https://te.wikipedia.org/wiki/సప్తచక్రాలు" నుండి వెలికితీశారు