ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (2) using AWB
పంక్తి 25:
 
==లక్ష్యాలు==
ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -
 
: సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.<ref name="about us">{{cite web|first1=సంపాదకులు|title=మా గురించి|url=http://eemaata.com/em/about#|website=ఈమాట|publisher=ఈమాట బృందం|accessdate=15 January 2015}}</ref>
పంక్తి 55:
 
== శీర్షికలు ==
ఈ మాటలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట వంటివి. ఇవే కాకుండా "గ్రంధాలయంగ్రంథాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలోగ్రంథాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం
 
==పాఠకుల అభిప్రాయాలు==
* విష్ణుభొట్ల లక్ష్మన్న (మే 2, 2006) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిద్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు: (1) ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం. (2) ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది. (3) ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది. - ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.
 
 
 
* సాయిరామ్ రాజు (జనవరి 9, 2009) : ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.
 
Line 67 ⟶ 64:
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఈమాట" నుండి వెలికితీశారు