మిట్టూరోడి కతలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →శైలి,ఉదాహరణలు: AWB తో RETF మార్పులు, typos fixed: → (2), చేసినాడు → చేసాడు using AWB |
||
పంక్తి 32:
== శైలి,ఉదాహరణలు ==
ఈ కథల్లో శైలి పూర్తిగా చిత్తూరు జిల్లాలోని మారు మూర పల్లెలోనిది. ఉదాహరణకు: ''మద్యానాలకు మకరాజవదామని....'' అనే కథలో......
'' నేను ఆరో తరగతిని తపుసు జేసినా పాసయి వుండేవాడ్ని గాదు. ఆరో తరగతిలో చేరినా ఏ,భీ,శీ,డీలు నేర్చుకున్నాననుకో, సంవత్సరం పరీచ్చలను ఏ రీతిగా రాసుందును. ఏ రీతిగా పాసయ్యుందును? కాసు బ్రమ్మానంద రెడ్డి మా ఇస్కూలు పిలకాయల పాలిట దేముడు మాదిరిగా దిగొచ్చి, ఆరో తరగతికి, ఎనిమిదికి, తొమ్మిదికి ఫయులు అనేది లేకుండా
క ... పిలకాయలందరు మొగలాయిలుగా పాసయి పోవాల్చిందేనని బ్రమ్మానంద రెడ్డి ఒక రూలు పాసు జేసి నడు. ఆ 'బి.పాసు.' దర్మాన నేను ఆరోతరగతిని గట్టెక్కేసినాను.......
''ఆర్య వ్యహారంబున దృష్టంబు గ్రాహ్యంబు.'' అనే కథలో .....
'' కయ్యలో పేడ తట్టలేసేసి నాక మాయమ్మ సినక్క కయ్య గెనిమ మింద గొంతు కూర్చొని నన్ను పక్కన బెట్టుకోని 'నేన్నీకు రెండు కథలు చెప్పాల సినబ్బా.. అని మొదలు బెట్టింది. ''ఒక రైతంట... ఆ రైతుకు ఒకపెళ్ళామంట. ఆ రైతు ఒట్టి ముండమోపి మొకమోడంట. రైతు పెళ్ళాం మాత్రం సివంగి అంట. ఉత్తర కొండను, దక్షిణ కొండను దొర్లించి పిండి జేసే రకమంట రైతు పెళ్ళాంది. రైతు మాత్రం... రెండు కాళ్ళు చాపేసి గురక పెట్టే దానికి ఇరవై నాలుగ్గంటలూ చాలేవి గాదంట. ఒక సారి రైతు చెరువుకింద ఎకరాను మొలగొలుకులు మడి చేసినాడంట. పంట ఇరగ పండిందంట. పంట నిండికి గువ్వలు చేరి పోయ్ నాయంట. పండిన పంటను కోసుకునే దానికి రైతుకు ఒళ్ళు బొలువైందంట. ఈ పొద్దు కోదాం రేపు కోద్దాం అంటానే వాయిదాలు పెడతా వుండాడంట. పంట మీద గువ్వలు మాత్రం పండగ చేసు కుంటా వుండాయంట. ఒక రోజు సందేళనంగా వచ్చిన తల్లి గువ్వలతో పిల్ల గువ్వలు ''అమ్మలాలా అమ్మలాలా.... మనం వేరే పంట చూసుకోవాల. ఈ రోజు మద్ద్యానం రైతు పట కాడికి వచ్చి రేపే కూలోళ్ళను బెట్టి కొయ్యించేస్తాను.... అని అంటా వుండినాడు.'' అని చెప్పినాయంట. పిల్ల గువ్వల మాటలకు పెద్ద గువ్వలు కీసు కీసుమన నవ్వి. ''ఆ రైతు మాటలను నమ్మ బాకండి. వాడి ముండ మొకాన ఎండ కాసిందిలే.... కానీండి. కూలోళ్ళతో మడి కోయిస్తాడంటావా? వాడి బయిసి
== ఇతరుల మాటలు ==
|