"నాయనార్లు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో RETF మార్పులు, typos fixed: → (7), , → ,, చేసినాడు → చేసాడు (3), చినారు → చారు (14) using AWB
చి (AWB తో RETF మార్పులు, typos fixed: → (7), , → ,, చేసినాడు → చేసాడు (3), చినారు → చారు (14) using AWB)
ఇవియే తమిళశైవ సాంప్రదాయము, తమిళవైష్ణవసాంప్రదాయము అనేవి. తమిళశైవ సాంప్రదాయము నాయనార్ల మూలమునను, తమిళవైష్ణవ సాంప్రదాయము [[ఆళ్వార్ల]] మూలమును వ్యాప్తిచెందినవి.
 
[[బౌద్ధ]], [[జైన]] మతములు స్థిరపడడానికి తోడ్పడిన ముఖ్యవిధానము "ఆహార-అభయ-భైషజ్య-శాస్త్రదానము". వీటిలో ఆహార-అభయ-భైషజ్యములు జనులకు నిత్యమున్ను కావలసినవే. మిషనరీ లందరూ ఏమతమువారైనా ఈమూడింటిని వినియోగించే తమ మతమును వ్యాప్తిలోనికి తెచ్చుకొనేది. ఆపద్ధతినే అవలంబించకపోతే శైవమతమును వ్యాప్తిలోనికి వచ్చి బౌద్ధజైనమతప్రచారము నిలువదని ఆకాలములో తోచినది. దానికి తోడు కేవలము శాస్త్రముగాక భక్యవేశముకూడా పుట్టిస్తేగాని మొదటి మూడున్ను నిష్ప్రయోజనములు అవుతాయని తోచినది. ఈపద్ధతులన్నింటినీ ఆనాటి శైవమతావేశాపరు లాచరణలోనికి తెచ్చినారుతెచ్చారు. అందులో భక్తివ్యాప్తికి భక్తచరిత్రములు చాలా ఉపయోగపడినవి. ఆశైవభక్తులకే "నాయనార్లు" అనిపేరు.
 
నాయనారు అంటే పూజ్యుడు అని అర్ధము. శివభక్తులెవరినా పూజ్యులే. అయినా, వారిలో ఎక్కువ ప్రసిద్ధిపొదినవారి పేళ్ళు జనశ్రుతిలో స్థిరముగా నిలచినవి. అసంఖ్యాతమహేశ్వరులలో అరవైముగ్గుర పేళ్ళు మాత్రము రానురాను జనుల వాడుకలోను, శైవప్రచారములోను నిలిచినవి. వీరినే '''అరవత్తుమూవురు'''(అఱుబత్తుమూవర్) అని అంటారు.
జైన సాంప్రదాయములో '''త్రిషష్టిశలాకా''' పురుషులున్నారు. ఈత్రిషష్టినటులే శైవులు ఉపయోగించుకునారు. త్రిషష్టి సలాకా పురుషులలో 24 తీర్ధంకరులు, 12 గురు చక్రవర్తులు, 9 గురు బలదేవులు, 9 గురు వాసుదేవులు, 9 గురు ప్రతివాసుదేవులు చేరినారు. మొతాం 63 మంది అయినారు. ఈ సంఖ్యను తప్పిస్తే కార్యములేదు. కాబట్టి తమిళనాయనర్లు మొత్తం 63 మంది. వీరిలో 24 గురు తీర్ధంకరులలో మొదటివాడు ఋషభుడు. ఇతడు శైవములో బసవడైనాడు.మూడోవాడు శంభవుడు. ఇతడు నాయనార్లలో శంభుచిత్తుడైనాడు. నాలుగోవాడు అభినందనుడు. ఇతడే అభిరాముడనే నాయనరయినాడు. ఇతడే నందుడుగకూడా మారి ఉంటాడు. 7వ తీర్ధంకురడైన సుపార్స్వనకును, 23 వవాడైన పార్స్వునకును మారుగా పూసలనాయనా ఏర్పడినాడు. ఇతడు తొమ్మిదో తీర్ధంకురుడైన పుష్పదంతునికి కూడా శాఇవప్రతినిధి కావచ్చును. చంద్రపభుడనే 8వ తీర్ధంకుడే చండేశనాయనారయి ఉంటాడు. 15వ తీర్ధంకరుడు ధర్ముడు. ఇతడు నాయనార్లలో ధర్మభక్తుడైనాడు. 17 వ తీర్ధంకరుడైన కుంధు అనేవాడు కుత్తవనాయనారుగా అయి ఉండవచ్చును.
 
వీర శైవము తలదూపినదాక బసవడులేడు. బసవేశ్వరునికి పూర్వసాంప్రదాయములో అతడు ఋషభునికి నామాంతరమైన ఆదినాధునికి దగ్గర ఉచ్చారణ గల అతిభక్తుడు అనేపేరుతో నిలిచినాడునిలిచాడు. ఈఅతిభక్తుడే ఆడిభర్త, అతిపత్తార్ అనేనామాంతరములతో కనబడుతున్నాడు. ఇదిగాక నాయనార్లలో కొందరికి జైనమతముతోడి సంబంధము శాఇవసాంప్రదాయములో కూడా విస్మృతము కాలేదు. వాగీశనాయనారనే నామాంతరము గల అప్పరుకు ధర్మసేనుడనే పేరుకూడా ఉంది. అప్పరు అనేక జైనగ్రంధములనుకూడా వ్రాసినాడు. జైన మతమునకున్న, శైవమునకున్ను గల ఇట్టి పోలికలనింకా విస్తరించి వ్రాయవచ్చును. ఇట్లే బౌద్ధముతోడి పోలికలుకూడా ఈ శైవములో కనబడుతున్నవి. శాక్యనాధుడనే నాయనారు స్వయముగా శాక్య నాధుడైన బుద్ధభగవానుని ప్రతిబింబమే. అట్టి పోలికను మరుగుపెట్టడానికాపేరును సాంఖ్యతొండుడుగా మార్చుకొన్న సాంఖ్య తొండడే శాక్యనాధుడనే స్మృతి శైవసంప్రదాయము నుంచి తొలగిపోలేదు.
 
నాయనార్లెందరో మనకు చరిత్రలో కనబడతారు. కాని వీరందరున్ను అరవత్తుమూవురలో చేరలేదు. అరవైమూడు అనేసంప్రదాయము మొదట తమిళనాడులో పుట్టినది. తమిళము పేళ్ళాకు సంస్కృతనామములు కల్పించి సంస్కృత గ్రంధములలో చేర్చినారుచేర్చారు. ఇదే తరువాత కర్ణాటకకు, తెలుగు దేశమునకు వ్యాపించినది. ఈ వ్యాప్తిలో ఆయా తమిళపు పేళ్ళు అనేక వికారములకులోనై వివిధరూపములను పొందినవి. ఈ పేళ్ళు పట్టిక ఒక్కో భాషలో ఒక్కో గ్రంధములో మారుతూ వచ్చినవి.
 
తమిళము : పెరియపురాణము: పేక్కిలారు విరచితము. 19 వ శతాబ్దములోనిది.
మైసూరు ఇలాకా నంజంగూడు గ్రామములోని నంజుండేశ్వరాలయములో [https://en.wikipedia.org/wiki/Nanjangud Nanjangud] ఈ 63 నాయనార్ల విగ్రహములు నిలుపబడి యున్నవి. ఇవి శిలావిగ్రహములుగాను, వాటికి ఉత్సవ విగ్రహములైన లోహవిగ్రహములుగాను రెండు విధములగ ఉన్నవి. శిలావిగ్రహములపైన మైనముపట్టి వాటి అమదము మరుగుపడినది. ఈవిగ్రహములు ఏకాలమునాటివో నిర్ణయించబడలేదు. కాని వాటి తీరును బట్టి 15వ శతాబ్దము నాటివని అని కొందరు అంటారు.ఈ విగ్రహముల అడుగు భాగమున ఆయా నాయనార్ల పేర్లు కూడా వ్రాయబడియున్నది.కాని ఈ విగ్రహములు అక్కడ 66 ఉన్నవి వాటిలో ఒకదానికి పేరు చెక్కబడలేదు.ఈ అరవైఆరింటిలో ఏమూటిని నాయనార్ల విగ్రహములు కావో నిర్ణయించడము కష్టము.
 
హాలాస్యమాహాత్మ్యములో 63 రు నాయనార్ల చరిత్ర ఉన్నది కాని, ఈ నాయనార్లు మధూనేలిన రాజులనిన్ని, వారి చరిత్రములు శివుని 63 లీలలని చెప్పబడినవి. కాని, నాయనార్లందరు రాజులుగా తక్కిన గ్రంధములలో చెప్పబడిలేదు. అందుకే ఇది ప్రామాణికముగా తీసుకొనలేము.ఇక [[పాల్కూరికి సోమనాధుడు]] పండితారాధ్యచరిత్రములో అతడు 64రు సంఖ్యను చెప్పి 53 పేర్లను మాత్రమే ఇచ్చాడు.
 
==పాల్కూరి సోమనాధుని పట్టిక==
1. ఆదిభర్త
 
ఇతనికి తమిళములో అతిపత్తరనిన్ని, సంస్కృతములో అతిభక్త అని పేళ్ళు.పండితారాధ్యచరిత్రములో ఇతనిపేరుమాత్రమున్నది గని ఇతని వృత్తాంతము పెద్దగాలేదు. ఇతడు బెస్తవాడని, తనకు ప్రతిదినమున్ను దొరికిన మొదటి చేపను శివుని కర్పించేవ్రతము కలవాడని, తనకొకనాడు బంగారుచేపదొరకగా సంకోచింపక శివునకు సమర్పించి నాడని , దానికి మెచ్చి శివుడతనికి కైలాసవాసమిచ్చినాడని తమిళ గ్రంధములు తెలుపు చున్నవి.
 
2.అమరనీతి
 
ఇతని ఇంటికొకనాడు వృద్ధశైవభక్తుడొకడు వచ్చి తనరెండు గోచీగుడ్డలను దాచనిచ్చినాడుదాచనిచ్చాడు.అందులో ఒకటి పోయినది. దానికిబదులుగా మరొకటి ఇస్తానంటే అది తనదానికంటె బరువు తక్కువదని హఠము పట్టినాడు.అందుచేత రెండోగోచీ అంతబరువు సరిగా ఉండడానికి దానిని త్రాసులో నొకప్రక్కనుంచి రెండో ప్రక్క క్రొత్తగోచీ నుంచి తూచినారుతూచారు.తుదకు అమరనీతిని, అతని పెండ్లాము కూడా తక్కెడలో క్రూచుంటే గని అది సరితూగినదికాదు.ఇట్లు వారిద్దరుని ఆముసలవానికి బానిసలై పనిచేయవలసివచ్చినది. ఈకథ పెరియపురాణములోనిది. సోమనాధుడు అమరనీతిపేరును అరువత్తుమూవురులో చేర్చినాడుచేర్చాడు గాని కథను చెప్పలేదు.
 
3.అరివాళు
4. అళియదంగుళినాయనారు
 
ఇతనికే మహాధనుడనికూడా పేరున్నది. తెనుగు బసవపురాణ, పండితారాధ్యచరిత్రములోను ఈపేరున్నట్లు ఉన్నది. ఇతడొక శూద్రుడు. ఒకానొక వృద్ధశైవభక్తుడు అర్ధరాత్రివేళ వర్షములో వడవడ వణుకుతు ఆకలితో ఇంటికి రాగా, అతని ఆదరించి ఆఉదయమే పొలములో రాను చల్లిన వడ్లనేరితెచ్చి, దంచి, అన్నమువండిపెట్టి ఆకలితీర్చినాడట. ఆశైవభక్తుడు అన్నముతిని అతడుండిన పాకను కాల్చి తెల్లవారేసరికి అదృశ్యుడైనాడట. పాకను కాల్చిన విషయము పెరియపురాణములో లేదు. ఈ నాయనారి విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు. ఈ అళియదంగుళినాయనారు, ఇదంగళి నాయనారు ఒక్కరేనా? ఇదంగళినాయనారు పేరు పెరియపురాణములో ఉన్నది. సంస్కృతములో ఇదనికి ఇదంకృషి అనిపేరు. ఇతడొక చోళరాజు. ఇతడు తనధాన్యపుకోట్లలోని ధాన్యము నొకదొంగ ఎత్తుకొనిపోగ వానిని రాజు ఎదుటికి తెచ్చినారుతెచ్చారు. రాజతనిని దండించక తనధాన్యపు కొట్లను, భండారమును శైవవభక్తులు యధేచ్చగ వినియోగించుకోవలసినదని చెప్పి దొంగతనమే అనావశ్యక మయ్యేటట్టు చేసినాడుచేసాడు.
 
5. ఇరువదాండారి
7 ఏణాధినాధుడు
 
దీనులకు గృహదానము భూమిదానము అభిమతదానము ఇచ్చే భక్తులలో ఇతడొకడని పండితారాధ్యచరిత్రములో వ్రాయబడినది. బసవపురాణములో ఇతని కథ ఈరీతిగ ఉన్నది: ఇత డేలాపురమౌనకు రాజు.దేశములను జయిస్తూ కప్పములను తీసుకుంటూ ఉంటే ఆదేశములవారు ఒక దళవాయిని పంపినారు. ఏణాధినాధుడు అతడిని ఎదుర్కొన్నాడు. కాని అతని భూతి రద్రాక్షధారణమును చూచి ఖడ్గమును విడిచి అతనికాళమీదపడినాడు. వాడూరుకోకుండా ఖడ్గముతో నరుకుతూ ఉంటే 'శివ,శివ' అంటూ ఉండగా అతని కఠములో పూల దండపడినవి. శివుడతనికి ప్రత్యక్షమై అక్షరత్వము నిచ్చినాడునిచ్చాడు.
 
8. ఓణుమూర్తి
 
దీనికి ఎణుమూర్తి అని బసవపురాణపాఠము.ఒణుమూర్తియే అణుమూర్తి అయిఉంటాడు.ఇతడే స్కందనాధుడు.ఇతనికథ తమిళపెరియపురాణములో లేదు. బసవపురాణములో ఇతని కథ ఈరీతిగ ఉన్నది: ఇతడు తన ప్రాణలింగమునకు ప్రతిదినము మేలిచందనము అర్పించే వ్రతము కలిగి దానిని ఆచరింస్తూ ఉండగా దగ్గరనున్న ధనము అంతా అయిపోయింది. తన వ్రతమును నిలుపుకొనడానికి అతడు తన మోచేతిని సానమీద నూరి అర్పిస్తే అదే శ్రీచందనమైనది. ఈభక్తికి మెచ్చి శివుడతనిని తనవిమానములో కైలాసమునకు తీసుకొని పోయినాడట. ఇతని విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు.
 
9 కడమలనంబి
14. కళియంబ
 
పెరియపురాణములో ఇతనిపేరు కలికంబ, కలికంప అని ఉన్నది.ఇతడొకచోళరాజు. ఇతడు కులమును విచారించకుండ, శివభక్తుడైవడైనా సరే కాళ్ళు కడిగి పూజించేవాడు.ఒకనాడితని సేవకుడే శివభక్తులతో కూడి రాగా రాజతని కాళ్ళు కడుగడానికుద్యుక్తుడై భార్యను నీళ్ళుపోయమన్నాడు. ఆమే నిరాకరింపగా అతడామె రెండుచేతులను నరికించి తానే కాళ్ళు కడిగి అందరితో బాటు వానికిన్ని విందుచేసినాడువిందుచేసాడు. ఈకథ బసవపురాణము, పండితారాధ్యచరిత్రములోను ఉన్నది.
 
15 కారినాయనార్
 
ఇతనికి కారినాధుడని సంస్కృతపు పేరు. ఇతదు భిక్షాటనము చేసితెచ్చిన ధనముతో చాలా శివాలయములను కట్టించినాడుకట్టించాడు. కారి అనే పేరు బాగుండదనేమో గాని నంజుడేశ్వరాలయములోని విగ్రహమును చెక్కిన శిల్పి అవికారి అనే చక్కని పేరు కల్పించినాడుకల్పించాడు.
 
16 కాళవ్వ
 
ఈమెకు కరికాళవ్వ అనికూడా పేరున్నది. తమిళములో కరికాళమ్మొయార్ అని, సంస్కృతములో పూతవతి అని పేరు. శివుడు ఈమ ఇంట మామిడపండుల మరుగున నమలినాడట. పెరియపురాణము ప్రకారము ఈమె వైశ్యస్త్రీ. భర్తతనకిచ్చిన రెండుమామిడిపండ్లను గంపలకొద్దీ పండ్లనుగామార్చి శివుని కారగింపబెట్టినది. శివభక్తిమూలముగా గొప్పశక్తులను సంపాదించినది.
 
17 కీర్తినాధుడు
21. కోల్పులి
 
ఇతని పేరుకు బసవపురాణ పీఠికలో కోళ్వులి అని ఉన్నది. పెరిఅయపురాణములో ఇతని పేరు కొట్పురినాయనార్, సంస్కృతములో వీరశార్దూలుడు. ఇతడొక చోళరాజుక్రింద మండలేశ్వరుడు. ఇతడు శివభక్తులకోసము గాదెలతో ధాన్యమును నిలువచేసి యుద్ధమునకు పోయియుండగా, అతనిభార్య కరువుపట్టుట వలన ఆధాన్యమును తన బంధువులకు ఉపయోగించినది. అతడు తిరిగి ఇంటికి వచ్చి వృత్తాంతమును తెలుసుకొని భార్య రెండు చేతులను తెగగొట్టించినాడుతెగగొట్టించాడు.
 
22.గుగ్గుళుకళియారు
 
ఇతడే మానధనుడు. ఇతనికి తమిళములో కుంకుళినాయనార్ అనిపేరు. బసవపురాణములో ఇతని కథ ఇటులున్నది. ఇతడు త్రికాలములలోనూ శివునికి గుగ్గులుధూపము వేసేవ్రతము కలవాడై, ధనమంతా వ్యయముకాగా తనాఅలిమంగళిసూత్రమును కూడా అమ్మివేసినాడు. తిరుపరంధామ అనేపురములో ఉరగేశ్వరలింగముముందర ఉరగ కన్యకలు పాడగా పారవశ్యముచేత లింగము ముందునకు వ్రాలినది. లింగమును సరి చేయటానికెన్నో ప్రయత్నములు జరుపగా చివరికి ఇతడు రాజు దగ్గరకు పోయి తనకు సరిపడ గుగ్గిలము ఇస్తే తను సరిజేస్తానని చెప్పినాడట. రాజొక గుగ్గిలపు రాశినివ్వగా, కళియారొక బట్టను చించి దాని ఒకకొనను లింగమునకు, రెండోకొనను ఖడ్గమునకు కట్టి, ఖడ్గమును మెడమీదపెట్టుకొని వెనుకకు నిగుడడమును చూచి ఆ నాగేశుడు ఈపటివలే లేచినాడులేచాడు.
 
23. గోనాధుడు
24. చండేశుడు
 
ఇతడు బ్రాహ్మణుడు. ఆవులకాపరు ఆవులను హింసించడమును సహించక తానే ఆవులకాపరిగా మారి వాటిని తీసుకొపోయి వాటిపాలను లింగముపై పిండి అభిషేకము చేశ్తూ ఉండేవాడు.ఆవుల కాపురి అతని తలితండ్రులతో మొరపెట్టుకొనగ తండ్రి పోయి చండుని మమదలించినాడుటమమదలించాడుట. చండునికి కోపము వచ్చి తండ్రి అని గమనింపక అతని తలనుతెగవేసినాడు. శివుడు మెచ్చుకొన్నాడు.
 
25. చిరుతొండడు.
 
ఇతడు సుప్రసిద్ధ శివభక్తుడు. సెట్టికులమువాడు.ఒక చోళరాజు సేనానాయకుడు.పశ్చిమచాళుక్యుల రాజధాని అయిన వాతాపి (బాదామి) దుర్గమును పట్టుకొని, దాని రాజు అయిన రెండవ పులకేశిని తనరాజు కప్పగించాడు. ఇతని కొడుకు శ్రీలాలుడు, లేక సిరియాలుడు. చిరుతొండడు శివుని కోరికమేరకు పసివాడాయిన కొడుకును చంపి అతనిమాంసము నారగింపుచేసినాడునారగింపుచేసాడు. అనిశ్చల భక్తిని మెచ్చి శివుడు సిరియాలుని బ్రదికించి చిరుతొండనుకి కైలాసప్రాప్తి ననుగ్రహించినాడుననుగ్రహించాడు. ఇతనికి సంస్కృతములో భద్రభక్తుడని పేరు. శైవేతరులు వెక్కిరింపుగా ఇతనిని దభ్ర భక్తుడని అందురు. శైవులున్ను అదేపేరుతో పిలువడమే వింత. నంజుడేశ్వరాలయము విగ్రహముపై ఇతని పేరు ధర్మకేతుడని ఉన్నది.
 
26. చిరుత్తాణ
 
తమిళములో నరసింగనాయనార్ అనిపేరు. సమస్కృతములో రణమిత్రుడని పేరు. నరసింహముని శివభక్తుడయిన రాజనిన్ని, సుందరనంబిని కొడుకుగా పుంచుకున్నాడని తమిళపురాణము చెప్పుచున్నది. పెరియపురాణములో శివభక్తుడుగా తెలుపబడిన కళర్చింగనాయనారు కూడా ఈ నరసింగనాయనారే. ఇతడే కాంచీ పురాధీశుడయిన పల్లవరాజు నరసింహవర్మ. ఇతనికి సింహాంక, పాదసింహ, పంచపాదసింహ అని పేర్లు. ఇతని భార్య శివ నిర్మాల్యమైన పూలదండను చేతితోతీసి మూర్కొనగా ఆదోషమునకు భార్య చేతులను నరకి వేసినాడు.
 
27 చిరుపులి
 
[[File:1 ఆదిభర్త నాయనారు.png|thumb|left|ఆదిభర్త నాయనారు]]
[[File:2 అమరనీతి నాయనారు.png|thumb|right|అమరనీతి నాయనారు]]
[[File:3 అరివాళు.png|thumb|centre|అరివాళు]]
[[File:4 అళియదంగుళినాయనారు.png|thumb|left|అళియదంగుళినాయనారు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1950705" నుండి వెలికితీశారు