ఇప్పనపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
'''ఇప్పనపాడు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మండపేట]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. ఈ గ్రామము తాపేశ్వరమునకు మరియు ద్వారపూడికి మధ్యన ఉన్నది.
 
==స్థలపురాణం==
[[దుర్వాసుడు|దూర్వాస మహాముని]] వలన అజముఖి అనే అతిలోక సౌందర్యరాశికి [[ఇల్వలుడు]], [[వాతాపి]] అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారు మదమత్తులై తండ్రి దూర్వాసుని తపఃఫలం తమకు ధారపోయమని అడుగుతారు. దానికి ఆయన నిరాకరిస్తాడు. దానితో వారు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి వరాలు పొందుతారు. వాతాపిని ఖండ ఖండాలుగా నరికి వేసినా పిలిచిన వెంటనే బ్రతికి వచ్చే మృతసంజీవని విద్యను వరంగా పొందారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి అడవిలో ఎవరైనా ఒక ముని కాని, బాటసారి కాని ఎదురుపడితే మా ఇంటిలో పితృకార్యం జరుగుతోంది అతిథిగా రమ్మని ఆహ్వనించేవాడు. అతని మాట నమ్మి అతని వెంట వెళ్లిన వాళ్లకు ఇల్వలుడు తన తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి మాంసాన్ని వండి వడ్డించేవాడు. అతిథి కడుపు నిండా భుజించాక తమ్ముడా వాతాపీ బయటకు రా అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి ఆ అతిథి పొట్ట చీల్చుకుని వచ్చి అన్నతమ్ములిరువురూ నరమాంసాన్ని భక్షించేవారు. ఈ విధంగా మునులు బాటసారుల సంఖ్య తగ్గిపోసాగింది. ఈ వార్తను మునులు [[అగస్త్య మహర్షి| అగస్త్యునికి]] చేరవేశారు. అగస్త్యుడు వారి సంగతి తేల్చడానికి బయలుదేరాడు. ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణుడి వేషంలో అగస్త్యుడిని భోజనానికి పిలిచాడు. వాతాపి మేకగా మారిపోతాడు. అగస్త్యమహర్షికి అన్నం వడ్డింస్తాడు. అతడు హాయిగా భుజిస్తాడు. మంచి అన్నం పెట్టారంటూ వాతాపి "జీర్ణం వాతాపి జీర్ణం" అంటూ పొట్టను నిమురుకుంటూ వెళ్లివస్తానని బయలుదేరతాడు. ఇల్వలుడు వాతాపిని పిలిచినా రాలేదు. "ఇంకెక్కడి వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడు" అని చిరునవ్వుతో చెబుతాడు అగస్త్యుడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని చంపడానికి ఎగబడ్డాడు. అగస్త్యుడు కోపంగా కళ్లెఱ్ఱ జేస్తే ఇల్వలుడు భస్మమై పోతాడు. తరువాత ప్రజలు వాతాపి నివసించిన ప్రాంతాన్ని వాతాపేశ్వరం అని ఇల్వలుడు ఉన్న ప్రాంతాన్ని ఇల్వలపురం అని పిలవడం ప్రారంభించారు. వాతాపేశ్వరం క్రమంగా తాపేశ్వరంగా మారింది. ఇల్వలపురం కాలక్రమేణా ఇప్పనపాడుగా రూపాంతరం చెందింది<ref name=గ్రామచరిత్ర>{{cite book|last1=మేడపాటి|first1=వెంకటరెడ్డీ|title=అర్తమూరు గ్రామ చరిత్ర|date=2015|publisher=ఎం.ఎం.ఎల్.రెడ్డి & ఎం.యస్.రెడ్డి|location=ఆర్తమూరు|pages=48-49|edition=ప్రథమ|accessdate=3 September 2016}}</ref>.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 5,483 - పురుషుల సంఖ్య 2,686 - స్త్రీల సంఖ్య 2,797 - గృహాల సంఖ్య 1,701
"https://te.wikipedia.org/wiki/ఇప్పనపాడు" నుండి వెలికితీశారు