"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

* రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
* ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
* కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే [[ఉల్లి]] రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
* కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
* మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
*మంచి గంధపుముక్కను చెక్కమీద సానతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్నా కొద్దిసేపటి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు <ref> [http://www.visalaandhra.com/women/article-56360 మొటిమలు - గంధపుముక్క]</ref> పోతాయి.
*జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి. <ref>[http://www.stylecraze.com/articles/simple-home-remedies-to-remove-pimples-overnight/ జాజికాయ] </ref> ముఖసౌందర్యం పెరుగుతుంది.
*నిమ్మరసంలో [[తులసి]] ఆకుల్ని పేస్ట్‌లా నూరి, మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే గాక, మచ్చలు కూడా పోతాయి
*ఒక టేబుల్ స్పూన్ చొప్పున [[తేనె]], పాలు, పసుపు పొడి మరియు సగం చెంచా నిమ్మకాయ రసం కలిపి మోహనికి రాసుకొని 25 లేక 30 నీమూసలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కదుకుంటే మొటిమలు తగ్గుతాయి.
*నిమ్మకాయ రసం మొటిమలకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి.
*ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
*[[టమోటా]] గుజ్జు మొటిమలకి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి, ఇలా రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
 
==మొటిమలతో జాగ్రత్తలు==
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1952684" నుండి వెలికితీశారు