అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
== చరిత్ర ==
=== స్థానిక అమెరికనులు, ఐరోపా వలసదారులు ===
హిమ యుగం ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతం అసియా ఖండంలోని సైబీరియా తో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెన గా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ [[కొలంబస్]] 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిర పడింది. అనాదిగా అక్కడ స్థిర పడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లు (నేటివ్ అమెరికన్స్) గా పిలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలయిన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు.
 
యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతి గా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.
 
1492 లో స్పెయిన్ సామ్రాజ్య ఒప్పందంతో '''క్రిస్టోఫర్ కొలంబస్''' పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రెల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన '''జువాన్ ఫోన్స్ డె లియోన్''' తాను
'''లా ఫ్లోరిడా''' గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటిన యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల [[నైరుతి]] భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్'''యూ ఫ్రాంస్''' పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ ఖాంతం దుగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేంస్ టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్ మరియు ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు.
ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు [[బ్రిటన్]] అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం మరియు మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.
 
1674 డచ్ వారి అమెరికన్ భూములను ఆంగ్లేయులకు వదిలారు. న్యూనెదర్లాండ్ రాష్గ్ట్ర భాగానికి న్యూయార్క్ అని నామకరణం చేసారు. కొత్తగా వచ్చి చేరిన వలసదారులలో మూడింట రెండు వంతుల వారు 1630-1680 మధ్య కాలంలో ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతమైన వర్జీనియాకు వచ్చి చేరిన ఒప్పంద కూలీలే. 18వ శతాబ్ధానికి పలు ప్రాంతాలలో ఆఫ్రికన్ బానిసలు ఒప్పంద కూలీలకు ప్రధానవనరు అయ్యారు. 1729 నాటికి కరోలినా విభాగాలు మరియు 1732 నాటికి జార్జియా కాననీలు 13 బ్రిటిష్ కాలనీలు కలసి '''అమెరికా సంయుక్త రాష్ట్రాలు'''గా స్థాపించబడింది. పురాతన ఆంగ్లేయుల హక్కుల పట్ల వృద్ధి చెందుతున్న భక్తి మరియు స్వతంత్ర ప్రభుత్వ లక్ష్యంతో అన్ని ప్రాటీయ ప్రభుత్వాలు స్వేచ్చాయుతమైన ఎన్నికలను నిర్వహించి రిపబ్లికన్ పార్టీని ఉతేజకరంగా బలపరచాయి.