న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
== భౌగోళికం ==
[[దస్త్రం:Aster newyorkcity lrg.jpg|left|thumb|widthpx|కోటి మంది ప్రజలు నివసిస్తున్న న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతపు '''శాటిలైట్ చిత్రం''']]
న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ[[ఈశాన్యం]]లోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.షుమారు [[వాషింగ్టన్]] మరియు [[బోస్టన్]] మధ్యభాగంలో ఉంది. ఇది [[హడ్సన్ నది]] ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు అట్లాంటిక్ సముద్రంలో పెద్ద వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందటానికి సహకరించింది. న్యూయార్క్‌లో ఎక్కువ భాగం [[మాన్‌హట్టన్]]‌,[[స్టేటన్ ద్వీపం]] మరియు [[లాంగ్ ఐలాండ్]] అనే మూడు దీవులలో నిర్మించబడింది.పెరిగే జనాభాకు తగినంత భూభాగం తక్కువైన కారణంగా అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటైంది.<br />
హడ్సన్ నది న్యూయార్క్ లోయల నుండి ప్రవహించి న్యూయార్క్ సముద్రంలో కలుస్తుంది. హడ్సన్ నది నగరాన్ని [[న్యూజెర్సీ]] నుండి వేరుచేస్తుంది.లాంగ్ ఐలాండ్ నుండి హడ్సన్ నది నేరుగా ప్రవహిస్తూ [[బ్రోంక్స్]] మరియు ''మాన్‌హట్టన్'' దీవులను ''లాంగ్ ఐలాండ్'' నుండి వేరుచేస్తూ ఉంటుంది.''హార్లెమ్ నది '' వేరొక వైపు నేరుగా ప్రవహిస్తూ తూర్పుప్రాంతం మరియు ''హడ్సన్ నదుల '' నదులమధ్య నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్ మరియు మాన్‌హట్టన్ లను వేరుచేస్తూ ఉంటుంది.<br />
నగర భూభాగం కృత్రిమంగా మానవప్రయత్నంతో కొంచం కొంచం విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరణ కార్యక్రమం డచ్ కాలనీ కాలంలోనే ప్రారంభం అయింది.మాన్‌ హట్టన్ దిగువ ప్రాంతంలో ఈ విస్తరణ సుస్పష్టంగా చూడచ్చు.1970 మరియు 1980వ సంవత్సరంల మధ్య [[మాన్‌హట్టన్]] లోతట్టు ప్రాంతంలో అభివృద్ధి చేసిన ''బ్యాటరీ పార్క్ సిటీ ''ఈ విస్తరణను స్పష్టంగా గుర్తించవచ్చు.ప్రత్యేకంగా మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ విస్తరణ వలన సహజ సిద్ధత కనుమరుగైంది. <br />
న్యూయార్క్ నగర విస్తీర్ణం 304.8 చదరపు మైళ్ళు.న్యూయార్క్ నగర మొత్తం ప్రదేశం 468.9 చదరపు మైళ్ళు.159.88 చదరపు మైళ్ళు జలభాగం మిగిలిన 321 మైళ్ళు భూభాగం. నగరంలో ఎత్తైన ప్రాంతం స్టేటన్ దీవిలోని ''టాట్ హిల్ ''(Todt Hill).ఇది సముద్ర మట్టానికి 409.8 అడుగులు ఎగువన వుంది.దీని దిగువభాగం దట్టమైన వనప్రదేశం.స్టేటన్ దీవి గ్రీన్‌బెల్ట్‌లో ఇది ఒక భాగం.
 
== వాతావరణం ==
"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు