అల్లు రామలింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==చలనచిత్ర జీవితం==
అల్లు నాటాకాలు చూసిన [[గరికపాటి రాజారావు]] చిత్రసీమలో తొలిసారిగా 1952లో [[పుట్టిల్లు]] చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' [[వద్దంటే డబ్బు]] 'లో అవకాశం వచ్చింది.
[[పుట్టిల్లు]] చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు [[హోమియోపతీ వైద్య విధానం|హోమియో వైద్యం]] నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు.
 
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి [[మూగమనసులు]], [[దొంగరాముడు]], [[మాయా బజార్]], [[ముత్యాల ముగ్గు]], [[మనవూరి పాండవులు]], [[అందాలరాముడు]], [[శంకరాభరణం]] మొదలైనవి వున్నాయి. [[ముత్యాలముగ్గు]] సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్న గొప్ప నటుడుపాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' [[మనుషులంతా ఒక్కటే]] ' చిత్రంలో ''ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా'' అనే పాట అప్పట్లో హిట్.
 
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్‌ నెలకొల్పి ' [[బంట్రోతు భార్య]] ', [[దేవుడే దిగివస్తే]] , [[బంగారు పతకం]] చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' [[డబ్భుడబ్బు భలే జబ్బు]] ' చిత్రం తీసాడు. [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[రమణారెడ్డి]], [[కుటుంబరావు]], [[బాలకృష్ణ]] వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' 'ఆమ్యామ్య.. అప్పుం అప్పుం '' లాంటి ఊతపదాలు అతనుఆయన సృష్టించినవే.
 
== పురస్కారాలు, సన్మానాలు==
"https://te.wikipedia.org/wiki/అల్లు_రామలింగయ్య" నుండి వెలికితీశారు